త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 WarmUps | ఇండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్.. ఎప్పుడు? ఎందులో చూడాలి?

T20 World Cup 2026 WarmUps | ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ భారత్ టోర్నమెంట్‌కు ముందు తన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత జట్టు కూర్పుకు తుదిరూపం ఇవ్వడానికి కీలకంగా మారనుంది.

S

Cricket | Published On Feb 4, 2026, 12.25 pm IST

T20 World Cup 2026 WarmUps | ఇండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్.. ఎప్పుడు? ఎందులో చూడాలి?
Advertisement

T20 World Cup 2026 WarmUps | ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ భారత్ టోర్నమెంట్‌కు ముందు తన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత జట్టు కూర్పుకు తుదిరూపం ఇవ్వడానికి కీలకంగా మారనుంది. ఇక మ్యాచ్‌ను బుధ‌వారం ఫిబ్ర‌వ‌రి 4, 2026వ తేదీన రాత్రి 7 గంట‌ల‌కు ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో నిర్వ‌హించ‌నున్నారు.

టీ20 ప్ర‌పంచ క‌ప్ హ‌క్కుల‌ను ఇప్ప‌టికే సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్ వ‌ర్క్ ఈ వార్మ‌ప్ మ్యాచ్‌ల‌ను కూడా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది. క‌నుక శాటిలైట్ టీవీలో స్టార్ స్పోర్ట్స్ చానల్స్‌లో ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో వీక్షించ‌వ‌చ్చు. ఇక డిజిట‌ల్ హ‌క్కుల‌ను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. క‌నుక జియో హాట్ స్టార్ యాప్ లేదా వెబ్ సైట్‌లో ఈ మ్యాచ్‌ను వీక్షించ‌వ‌చ్చు.

భారత‌ జట్టు:

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.

సౌతాఫ్రికా జట్టు:

ఎయిడెన్ మార్క‌ర‌మ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, రయాన్ రికెల్టన్, జార్జ్ లిండే, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బోష్, కేశవ్ మహారాజ్, క్వెనా మఫాకా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోకియా, మార్కో యాన్సెన్, కాగిసో రబడా, డేవిడ్ మిల్లర్.

Advertisement

తాజావార్తలు

Advertisement