Special Trains | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్–కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు
Special Trains | శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్–కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి కొల్లంకు, తిరిగి కొల్లం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది.
Special Trains | శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్–కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి కొల్లంకు, తిరిగి కొల్లం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. ఒక్కో మార్గంలో నాలుగు ట్రిప్పుల చొప్పున మొత్తం ఎనిమిది సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లతో తెలంగాణ నుంచి శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు ఉపయోగకరంగా ఉండనున్నాయి. 07193 నంబర్ రైలు ప్రతి శనివారం హైదరాబాద్‌లో రాత్రి 11.10 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం ఉదయం 7.15 గంటలకు కొల్లం చేరుకుంటుంది. వచ్చే జనవరి 2 నుంచి జనవరి 23 వరకు అందుబాటులో ఉంటుంది. కొల్లం-హైదరాబాద్ 07194 నంబరు గల రైలు ప్రతి సోమవారం ఉదయం 10.55 గంటలకు కొల్లంలో బయలుదేరుతుంది.
మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. జనవరి 4 నుంచి జనవరి 25 వరకు రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు రెండుమార్గాల్లో కాయంకుళం, మావేలికర, చెంగన్నూర్, తిరువల్ల, చంగనస్సేరి, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, అలువా, త్రిస్సూర్, పాలక్కాడ్, పొదనూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. అయ్యప్పస్వామి మండలదీక్ష, మరవిళుక్కు వేడుకల సందర్భంగా శబరిమల వెళ్లే భక్తులకు ఎంతగానో ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడనున్నాయి. హైదరాబాద్ నుంచి కొల్లం వెళ్లే రైలుతో పాటు తిరుగు ప్రయాణానికి కూడా ప్రత్యేక సర్వీసు ఏర్పాటు చేయడంతో యాత్రికులకు వెసులుబాటు కలగనుంది. ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jharkhand | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆలయానికి వెళ్తూ 13 మంది దుర్మరణం
- ●JMM | అటా.. ఇటా!.. డీలిమిటేషన్‌పై ఎటూ తేల్చని జార్ఖండ్ ముక్తి మోర్చా
- ●Ragging | మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లపై వేటు
- ●Road Accident | కారును ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- ●Horoscope | నవంబర్ 29 రాశి ఫలాలు.. మీ అన్వేషణా దృక్పథంతో మంచి ఫలితాలు పొందుతారు!
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

Jharkhand | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆలయానికి వెళ్తూ 13 మంది దుర్మరణం

JMM | అటా.. ఇటా!.. డీలిమిటేషన్‌పై ఎటూ తేల్చని జార్ఖండ్ ముక్తి మోర్చా

Ragging | మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లపై వేటు

Road Accident | కారును ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి






