త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mohammed Shami | రీఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్న మొహ‌మ్మ‌ద్ ష‌మీ..? 9 నెల‌ల అనంత‌రం టీమ్‌లోకి..?

Mohammed Shami | భార‌త క్రికెట్ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ మొహ‌మ్మ‌ద్ ష‌మీ దాదాపు 9 నెల‌ల విరామం అనంత‌రం మ‌ళ్లీ ఎట్ట‌కేలకు టీమ్‌లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. దేశవాళీ టోర్నీల్లో వికెట్ల‌ను తీస్తూ చాటుతున్న ష‌మీ మ‌ళ్లీ భార‌త జట్టులోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుండగా ఎట్ట‌కేల‌కు సెలెక్ట‌ర్లు అత‌నికి మ‌ళ్లీ చాన్స్‌లు ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

S

Cricket | Published On Jan 1, 2026, 12.46 pm IST

Mohammed Shami | రీఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్న మొహ‌మ్మ‌ద్ ష‌మీ..? 9 నెల‌ల అనంత‌రం టీమ్‌లోకి..?
Advertisement

Mohammed Shami | భార‌త క్రికెట్ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ మొహ‌మ్మ‌ద్ ష‌మీ దాదాపు 9 నెల‌ల విరామం అనంత‌రం మ‌ళ్లీ ఎట్ట‌కేలకు టీమ్‌లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. దేశవాళీ టోర్నీల్లో వికెట్ల‌ను తీస్తూ చాటుతున్న ష‌మీ మ‌ళ్లీ భార‌త జట్టులోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుండగా ఎట్ట‌కేల‌కు సెలెక్ట‌ర్లు అత‌నికి మ‌ళ్లీ చాన్స్‌లు ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తేడాది మార్చిలో చాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడిన ష‌మీ మ‌ళ్లీ జ‌ట్టులోకి రాలేదు. గాయాల కార‌ణంగా జ‌ట్టులో స్థానాన్ని కోల్పోయాడు. అయితే ఆ త‌రువాత తాను ఫిట్ గానే ఉన్నాన‌ని, రంజీ మ్యాచ్‌ల‌లోనూ ఆడుతున్నానని చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ సెలెక్ట‌ర్లు అత‌న్ని ప‌ట్టించుకోలేదు. ఓ ద‌శ‌లో సెలెక్ట‌ర్ల‌పై అత‌ను బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశాడు. అయితే సెలెక్ట‌ర్లు మాత్రం అత‌న్ని ఎంపిక చేయ‌క‌పోవ‌డానికి వేరే కార‌ణాలు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం షమీ ఇస్తున్న ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా అత‌న్ని మ‌ళ్లీ జ‌ట్టులోకి తీసుకోవ‌డం దాదాపుగా ఖాయ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది.

న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక‌..?

టీమిండియా ఈ ఏడాదిలో ముందుగా సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్‌తో 3 వ‌న్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. జ‌న‌వ‌రి 11 నుంచి వారి టూర్ భార‌త్‌లో మొద‌ల‌వుతుంది. ఈ క్ర‌మంలోనే తొలి వ‌న్డేను జ‌న‌వ‌రి 11వ తేదీన వడోద‌ర‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌రువాత రెండు, మూడు వ‌న్డేలు వ‌రుస‌గా జ‌న‌వ‌రి 14, 18 తేదీల్లో రాజ్‌కోట్‌, ఇండోర్‌ల‌లో జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఈ సిరీస్‌కు ష‌మీని ఎంపిక చేయాల‌ని సెలెక్ట‌ర్లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో బౌల‌ర్ జ‌స్‌ప్రిత్ బుమ్రా, ఆల్ రౌండ‌ర్ హార్దిక్ ల‌కు ఈ వ‌న్డే సిరీస్‌ నుంచి విశ్రాంతిని ఇవ్వ‌నున్నట్లు తెలిసింది. దీంతో సీనియ‌ర్ బౌల‌ర్ అయిన ష‌మీకి ఈ సిరీస్‌కు గాను జ‌ట్టులో చోటు ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు. అలాగే ముకేష్ కుమార్‌, ఆకాష్ దీప్‌ల‌ను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. కానీ ఈ వార్త‌ల‌పై స్ప‌ష్ట‌త రావ‌ల్సి ఉంది.

దేశవాళీ టోర్నీల్లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌..

అయితే ష‌మీ రాక మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే రంజీ ట్రోఫీలో ఇటీవ‌ల 4 మ్యాచ్‌ల‌లో మాత్రమే ఆడిన ష‌మీ 20 వికెట్లు తీశాడు. అలాగే 50 ఓవ‌ర్ల టోర్నీ విజ‌య్ హ‌జారె ట్రోఫీ, టీ20 టోర్నీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీల‌లో 3 మ్యాచ్‌ల చొప్పున వైట్ బాల్ క్రికెట్‌లో మొత్తం క‌లిపి 6 మ్యాచ్‌ల‌లో ఆడిన ష‌మీ 17 వికెట్లు తీసి ఆక‌ట్టుకున్నాడు. దీంతో న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు జ‌ట్టు ఎంపిక‌లో ఇత‌ర బౌల‌ర్ల‌తో ష‌మీ పోటీ ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ష‌మీ ఎంపిక దాదాపు ఖాయ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. అయితే రంజీ ట్రోఫీలో ఆడుతున్న‌ప్పుడే ష‌మీని భార‌త జ‌ట్టులోకి ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై ప‌లువురు మాజీలు సైతం సెలెక్ట‌ర్ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ ష‌మీకి ఉన్న గాయాలు, ఫిట్ నెస్ లేమి కార‌ణంగా అత‌న్ని ఎంపిక చేయ‌లేమ‌ని, అత‌ను మ‌రిన్ని మ్యాచ్‌ల‌ను ఆడి స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగిస్తే చూస్తామ‌ని సెలెక్ట‌ర్లు చెప్పారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ష‌మీ అదే విధ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్నాడు. దీంతో అత‌న్ని న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు ఎంపిక చేయ‌డం సెలెక్ట‌ర్ల‌కు త‌ప్ప‌నిస‌రిగా మారింది. అందువల్ల ష‌మీ మ‌ళ్లీ జ‌ట్టులోకి రానున్నాడ‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. అయితే ష‌మీని ఈసారైనా సెలెక్ట‌ర్లు ఎంపిక చేస్తారా..? 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ అత‌ను ఆడేలా ఇప్ప‌టి నుంచే అత‌ని ఎంపిక ఉంటుందా..? అన్న వివ‌రాలు వేచి చూస్తే తెలుస్తాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement