Kris Srikkanth | పాక్‌ను ఓడించేందుకు భారత-సి టీం చాలు.. ఓవర్ హైప్‌కు శ్రీకాంత్ చురకలు..
Kris Srikkanth | టీ20 వరల్డ్ కప్-2026లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఎదుర్కొన్న ఘోర పరాభవం తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల ప్రత్యర్థిత్వంపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఈ హైప్‌కు ఇక ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని భారత మాజీ ఓపెనర్, మాజీ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
Kris Srikkanth | టీ20 వరల్డ్ కప్-2026లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఎదుర్కొన్న ఘోర పరాభవం తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల ప్రత్యర్థిత్వంపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఈ హైప్‌కు ఇక ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని భారత మాజీ ఓపెనర్, మాజీ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. కొలంబోలో జరిగిన మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషించిన ఆయన, పాకిస్థాన్‌ను ఓడించేందుకు భారత్ సి-టీం చాలు అంటూ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ జట్టుకు అనవసర ఓవర్ హైప్..
ఆదివారం జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేయగా ఈ మ్యాచ్‌కు కొద్ది రోజుల ముందు నుంచి విపరీతమైన హైప్ ఏర్పడింది. కొలంబోలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని, పాక్ మొత్తం స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుందని, తమ వద్ద ఉస్మాన్ తారిక్ ఉన్నాడని, ఈ మధ్య కాలంలో స్వదేశంలో ఆసీస్ లాంటి దేశాలపై సిరీస్‌లను గెలిచి బ్యాటర్లు మంచి ఊపు మీద ఉన్నారని, కనుక కొలంబో మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి తీరుతామని పాక్ ప్రగల్భాలు పలికింది. వారి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తమ టీమ్‌కు ఓవర్ హైప్ ఇచ్చారు. కానీ ఫలితం మాత్రం వేరేలా వచ్చింది. దీంతో ఇదే విషయంపై శ్రీకాంత్ మాట్లాడుతూ పాకిస్థాన్‌కు చురకలు అంటించారు.
ప్రత్యర్థి కానే కాదు: శ్రీకాంత్
భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు విపరీతమైన హైప్ ఏర్పడిందన్న శ్రీకాంత్, ఆ హైప్ పాక్ ప్లేయర్లలో కనిపించలేదని అన్నారు. మ్యాచ్ అంతా ఏక పక్షంగా సాగిందని అన్నారు. తన యూట్యూబ్ చానల్లో వీడియోలో స్పందించిన శ్రీకాంత్ ఇకపై పాక్ ను చిరకాల ప్రత్యర్థిగా చూడలేమని, అసలు పోటీయే లేనప్పుడు ప్రత్యర్థిత్వం (Rivalry ) ఎలా ఉంటుందని అన్నారు. అసలు భారత జట్టుతో పోడీ పడే స్థాయి పాక్‌కు లేదని, ఈ విషయంలో తాను పాక్ ఫ్యాన్స్‌కు సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. మ్యాచ్‌లో తమ గొప్ప పేస్ బౌలర్ గా పాక్ చెప్పుకునే షహీన్ అఫ్రిది కూడా విఫలం అయ్యాడని, అలాగే బాబర్ ఆజంను ఆకాశానికి ఎత్తేస్తారని, కానీ అతను ఇలాంటి కీలక మ్యాచ్‌లలో కోహ్లి ఆడినట్లు ప్రదర్శన ఇచ్చే సత్తా అతనికి లేదన్నారు. ఇకపై పాక్‌కు అనవసరంగా హైప్ ఇవ్వాల్సిన పనిలేదని, ఆ జట్టు ప్రత్యర్థి కాదని, కేవలం ఒక టీం మాత్రమేనని అన్నారు.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

KTR | లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులుంటే తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించేవాళ్లం : కేటీఆర్
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



