త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ipl | ఐపీఎల్ కోసం హ‌నీమూన్ క్యాన్సిల్ – ప్లేట్ ఫిరాయించిన జోస్ ఇంగ్లిష్ – పంజాబ్ కింగ్స్ ఫైర్‌

Ipl | ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ జోస్ ఇంగ్లిస్ ఐపీఎల్ (Ipl) మినీ వేలంలో 8.6 కోట్ల‌కు అమ్ముడుపోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. జోష్ ఇంగ్లిస్‌పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకునేందుకు పంజాబ్ కింగ్స్ రెడీ అవుతోన్న‌ట్లు స‌మాచారం.

N

Sports | Published On Dec 20, 2025, 3.04 pm IST

Ipl | ఐపీఎల్ కోసం హ‌నీమూన్ క్యాన్సిల్ –  ప్లేట్ ఫిరాయించిన జోస్ ఇంగ్లిష్ – పంజాబ్ కింగ్స్ ఫైర్‌

జోష్ ఇంగ్లిస్

Advertisement

Ipl | ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ (Ipl) మినీ వేలంలో ఆస్ట్రేలియ‌న్ వికెట్ కీప‌ర్ క‌మ్ బ్యాట్స్‌మెన్ జోస్ ఇంగ్లిస్‌ను 8.6 కోట్ల‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ద‌క్కించుకుంది. ఐపీఎల్ వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఫారిన్ ప్లేయ‌ర్ల‌లో ఒక‌రిగా జోష్ ఇంగ్లిస్ నిలిచాడు. ఐపీఎల్ వేలంలో అత‌డిని కొనుగోలు చేసేందుకు హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో పాటు ఆర్‌సీబీ పోటీప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. చివ‌ర‌కు 8.6 కోట్ల‌కు ల‌క్నో ఈ వికెట్ కీప‌ర్‌ను సొంతం చేసుకుంది. ఈ ఆస్ట్రేలియ‌న్ వికెట్ కీప‌ర్‌పై పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఫైర్ అవుతోంది. లీగ‌ల్ యాక్ష‌న్‌కు రెడీ అయ్యింద‌ట‌. జోష్ ఇంగ్లిస్‌పై పంజాబ్ కింగ్స్ కోపం వెనుక పెద్ద కార‌ణ‌మే ఉంద‌ట‌.
గ‌త ఐపీఎల్‌లో జోష్ ఇంగ్లిస్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. మంచి హిట్ట‌ర్ అయిన ఈ బ్యాట్స్‌మెన్‌ను ఐపీఎల్ 2026 కోసం రిటెన్ష‌న్ చేసుకోవాల‌ని పంజాబ్ భావించింది. ఏప్రిల్ 18 జోష్ ఇంగ్లిస్ పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లి, హ‌నీమూన్ కార‌ణంగా ఐపీఎల్ 2026 లో కేవ‌లం నాలుగైదే మ్యాచ్‌లు ఆడుతాన‌ని పంజాబ్ కింగ్స్ యాజ‌మాన్యంతో ఇంగ్లిస్ చెప్పాడ‌ట‌. దాంతో రిటెన్ష‌న్ డెడ్‌లైన్‌కు ఓ గంట ముందు అత‌డిని పంజాబ్ వ‌దులుకుంది.

హ‌నీమూన్ క్యాన్సిల్‌

నాలుగైదే మ్యాచులు ఆడుతాన‌న్న జోష్ ఇంగ్లిస్‌ను ల‌క్నో 8.6 కోట్ల‌కు కొన‌డంతో పంజాబ్ కింగ్స్ తో పాటు మిగిలిన ఫ్రాంచైజ్‌ల‌లో అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఐపీఎల్ టోర్నీ మొత్తం అత‌డు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యం ల‌క్నోతో పాటు హైద‌రాబాద్ ఫ్రాంచైజ్‌ల‌కు ముందే తెలుసున‌ని అంటున్నారు. డ‌బ్బుల కోస‌మే అత‌డు పంజాబ్ కింగ్స్ ద‌గ్గ‌ర ఆబ‌ద్దం ఆడిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
మ‌రోవైపు వేలంలో త‌న‌కు 8.6 కోట్లు ద‌క్క‌డంతో జోష్ ఇంగ్లిస్ హ‌నీమూన్‌ను వాయిదా వేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. పెళ్లి కోసం ఐదారు రోజులు మాత్ర‌మే బ్రేక్ తీసుకోనున్నాడ‌ట‌. ఆ త‌ర్వాత తిరిగి ఇంగ్లిస్ ఐపీఎల్‌లో భాగం కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐపీఎల్‌ ముగిసిన త‌ర్వాతే భార్య‌తో క‌లిసి హ‌నీమూన్ వెళ్లాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.
అయితే జోస్ ఇంగ్లిస్‌పై పంజాబ్ కింగ్స్ యాజ‌మాన్యం కోపంగా ఉన్న‌ట్లు స‌మాచారం. డ‌బ్బుల కోసం ప్లేట్ ఫిరాయించిన ఇంగ్లిస్‌పై లీగ‌ల్‌గా యాక్ష‌న్ తీసుకునే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌.

Advertisement

తాజావార్తలు

Advertisement