త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jay Shah | రోహిత్ శ‌ర్మ మా కెప్టెన్‌.. జైషా అలా అన్నాక హిట్‌మ్యాన్ రియాక్ష‌న్ ఏంటంటే..?

Jay Shah | భార‌త వ‌న్డే క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మ‌న్, మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను ఐసీసీ చైర్మ‌న్ జైషా మన కెప్టెన్ అని సంబోధించ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం వ‌న్డేల్లో బ్యాట్స్‌మన్‌గానే ఉన్నాడు. ఏ జ‌ట్టుకు కూడా అత‌ను కెప్టెన్‌గా లేడు. టీ20లు, టెస్టుల‌కు ఇప్ప‌టికే రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్ ప్ర‌స్తుతం వ‌న్డేల్లోనే కొన‌సాగుతున్నాడు.

S

Cricket | Published On Jan 9, 2026, 9.50 am IST

Jay Shah | రోహిత్ శ‌ర్మ మా కెప్టెన్‌.. జైషా అలా అన్నాక హిట్‌మ్యాన్ రియాక్ష‌న్ ఏంటంటే..?
Advertisement

Jay Shah | భార‌త వ‌న్డే క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మ‌న్, మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను ఐసీసీ చైర్మ‌న్ జైషా మన కెప్టెన్ అని సంబోధించ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం వ‌న్డేల్లో బ్యాట్స్‌మన్‌గానే ఉన్నాడు. ఏ జ‌ట్టుకు కూడా అత‌ను కెప్టెన్‌గా లేడు. టీ20లు, టెస్టుల‌కు ఇప్ప‌టికే రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్ ప్ర‌స్తుతం వ‌న్డేల్లోనే కొన‌సాగుతున్నాడు. అయితే అత‌ను టెస్టుల‌కు రిటైర్ అయ్యాక అత‌ని స్థానంలో శుబ‌మాన్ గిల్‌కు కెప్టెన్సీ అప్ప‌గించారు. అలాగే వ‌న్డేల‌కు కూడా గిల్‌నే కెప్టెన్ ను చేశారు. ఇక టీ20ల‌కు మాత్రం సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్‌గా కొన‌సాగుతున్నాడు. అయితే ప్ర‌స్తుతం రోహిత్ కెప్టెన్ గా లేక‌పోయినా అత‌న్ని జైషా మాత్రం మ‌న కెప్టెన్ అని సంబోధించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఈసారి క‌ప్‌ను కూడా గెలుస్తాం..

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇటీవ‌ల నిర్వ‌హించిన జియో ఫౌండేషన్ ఈవెంట్‌కు జైషాతోపాటు క్రికెట‌ర్లు, సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో భార‌త క్రికెట్ జ‌ట్టుకు చెందిన మ‌హిళా, పురుష ప్లేయ‌ర్లు అంద‌రూ పాల్గొన్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఐసీసీ చైర్మ‌న్ జైషా 2023 వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ గురించి కీల‌క‌వ్యాఖ్య‌లు చేశారు. ఆ టోర్నీలో వ‌రుస‌గా అన్ని మ్యాచ్‌ల‌లోనూ భార‌త్ విజ‌యం సాధించి ఫ్యాన్స్ మ‌నసుల‌ను గెలుచుకుంద‌ని, కానీ ట్రోఫీని గెల‌వ‌లేక‌పోయింద‌ని అన్నారు. కానీ ఆ త‌రువాత 2024 ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను మ‌నం ఈసారి గెలుస్తామ‌ని, అభిమానుల మ‌న‌సుల‌ను కూడా గెలుచుకుంటామ‌ని అన్నాన‌ని గుర్తు చేశారు.

హిట్ మ్యాన్ రియాక్ష‌న్ ఇదే..

అయితే రోహిత్ శ‌ర్మ‌ను ఆయ‌న‌ కెప్టెన్‌గా ఎందుకు సంబోధించార‌నే విష‌యంపై కూడా జైషా మాట్లాడారు. రోహిత్ సార‌థ్యంలో భార‌త్ రెండు ఐసీసీ టైటిల్స్‌ను గెలుచుకుంది. క‌నుక‌నే రోహిత్‌ను మ‌న కెప్టెన్ అని అన్నాన‌ని జైషా తెలిపారు. అయితే జైషా మాట‌ల‌కు హిట్ మ్యాన్ స్పందించాడు. న‌వ్వుతూ చ‌ప్ప‌ట్లు కొట్టాడు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. అయితే ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ వ‌య‌స్సు 38 ఏళ్లు కాగా వ‌న్డే వ‌రల్డ్ క‌ప్‌కు దాదాపుగా మరో ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉంది. దీంతో ఆ టోర్నీలో రోహిత్ ఆడుతాడా లేదా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రోహిత్ ఆధ్వ‌ర్యంలో ఈ సారి కప్ గెలవాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక రోహిత్ ప్ర‌స్తుతం టీ20 క్రికెట్‌లో ఐపీఎల్‌లో ముంబైకి ఆడుతుండ‌గా, త్వ‌ర‌లో భార‌త్, శ్రీ‌లంక వేదిక‌లుగా జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఐసీసీ త‌ర‌ఫు నుంచి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement