త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jasprit Bumrah | యార్క‌ర్‌తో బ్యాట్స్‌మెన్‌ను బోల్తాకొట్టించిన బుమ్రా.. వీడియో

Jasprit Bumrah | ఎప్పుడూ బౌలింగ్‌తో బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తించే స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈసారి త‌న చురుకైన ఫీల్డింగ్‌తోనూ ఆక‌ట్టుకున్నాడు.

G

Cricket | Published On Feb 13, 2026, 6.24 am IST

Jasprit Bumrah | యార్క‌ర్‌తో బ్యాట్స్‌మెన్‌ను బోల్తాకొట్టించిన బుమ్రా.. వీడియో
Advertisement

Jasprit Bumrah | త్రినేత్ర‌.న్యూస్‌: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా భార‌త్ త‌న రెండో మ్యాచ్‌లో న‌మీబియాపై ఘ‌న విజ‌యం సాధించింది. తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ బౌల‌ర్ల ధాటికి బ్యాట‌ర్లు చేతులెత్తేసినా.. కెప్టెన్ సూర్య కుమార్ బాధ్య‌తాయుత‌మైన బ్యాటింగ్‌తో జ‌ట్టుకు చాలెంజింగ్ స్కోర్‌ను చేయ‌గ‌లిగింది. దీంతో అతిక‌ష్టంపైన 26 ప‌రుగులతో విజ‌యం సాధించింది. అయితే న‌మీబియాపై మాత్రం ఆల్‌రౌండ్ షోతో టీమ్ఇండియా అద‌ర‌గొట్టింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును ఏ ద‌శ‌లోనూ కోలుకోనివ్వ‌లేదు.

ఎప్పుడూ బౌలింగ్‌తో బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తించే స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈసారి త‌న చురుకైన ఫీల్డింగ్‌తోనూ ఆక‌ట్టుకున్నాడు. అక్ష‌ర్ ప‌టేల్ వేసిన 12.3 ఓవ‌ర్‌లో న‌మీబియా బ్యాట‌ర్ మ‌ల‌న్ క్రుగ‌ర్ స్వీప్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో గాల్లోకి ఎగిరిన బంతిని బుమ్రా వెన‌క్కి ర‌న్నింగ్ చేస్తూ క‌ళ్లు చెదిరిపోయే క్యాచ్ ప‌ట్టుకున్నాడు.

https://x.com/StarSportsIndia/status/2021986821002134008

ఇక బౌలింగ్‌లోనూ సూప‌ర్ యార్క‌ర్ వేసి న‌మీబియా బ్యాట‌ర్ రూబెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 16.4వ ఓవ‌ర్‌లో త‌న ప‌దునైన యార్క‌ర్‌తో రూబెన్‌ను బోల్తాకొట్టించాడు. దీంతో చాల రోజుల త‌ర్వాత త‌న‌దైన మార్క్ యార్క‌ర్‌తో అద‌ర‌గొట్టాడు.

https://x.com/StarSportsIndia/status/2021992722916426047

 

Advertisement

తాజావార్తలు

Advertisement