Ishan Kishan | ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌ల వెనుక ప్రభాస్ – బాహుబలి స్ఫూర్తితో!
Ishan Kishan | సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బ్యాటింగ్ మెరుపులతో అదరగొట్టాడు ఈషాన్ కిషన్. ఈ టోర్నీలోనే హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచిన ఈషాన్ కిషన్ తన టీమ్ ఝార్ఖండ్‌కు ఫస్ట్ టైమ్ కప్ అందించాడు. ఇషాన్ మెరుపుల వెనుక హీరో ప్రభాస్ ఉన్నాడట. అదేలాగంటే?
ఇషాన్ కిషన్
Ishan Kishan | ఇషాన్ కిషన్ ...క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మారుమోగుతోంది. ఈ హిట్టర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఈ సారి ఖాయమేనని అంటున్నారు. దూకుడుకు మారుపేరుగా నిలిచిన ఇషాన్ కిషన్ దేశవాళీతో పాటు ఐపీఎల్‌లో బ్యాట్‌తో అదరగొట్టి టీమిండియాలో స్థానం సంపాదించాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా వికెట్ కీపింగ్‌లో రాణించి ధోనీకి సరైన వారసుడు అంటూ పేరు తెచ్చుకున్నాడు. ఎంత వేగంగా టీమిండియాలో స్థానం సంపాదించుకున్నాడో అంతే ఫాస్ట్‌గా ఇషాన్ కిషన్ కెరీర్‌లో డౌన్‌ఫాల్ మొదలైంది. టీమిండియాకు (Team India) సెలెక్ట్ అయినా చాలా మ్యాచ్‌లలో అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. సెలెక్టర్ల తీరుతో అసహనం వ్యక్తం చేసిన ఇషాన్ కిషన్ అప్పట్లో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఓ సిరీస్ మధ్యలోనే మానసిక సమస్యల సాకుతో ఇండియాకు వచ్చేశాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడాలంటూ బీసీసీఐ పెట్టిన కండీషన్‌ను పట్టించుకోకుండా ఫారిన్ టూర్లకు వెళ్లడంతో అతడిపై బీసీసీఐ వేటు వేసింది. క్రమశిక్షణ చర్యల పేరుతో నేషనల్ టీమ్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది.
ఇషాన్ కిషన్ టీమిండియాకు ఆడి రెండేళ్లు దాటిపోయింది. మరోవైపు ఐపీఎల్‌లో మునుపటి మెరుపులు లేకపోవడంతో ఇషాన్ కిషన్ పనైపోయిందంటూ విమర్శలొచ్చాయి.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్..
ఈ విమర్శలకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా ధీటుగా బదులిచ్చాడు ఇషాన్ కిషన్. ఈ టోర్నీలో ఝార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు ఇషాన్ కిషన్. నాయకుడిగానే కాకుండా బ్యాటర్‌గా ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో 517 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గురువారం హర్యాణాతో జరిగిన ఫైనల్‌లో మెరుపు సెంచరీతో తన జట్టుకు విజయాన్ని అందించాడు. 49 బాల్స్‌లోనే పది సిక్సర్లు, ఆరు ఫోర్లతో 101 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ 2025 ట్రోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకున్నాడు.
ఈ మెరుపు సెంచరీతో తన ఫామ్ గురించి టీమిండియా సెలెక్టర్లకు హింట్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ మెరుపుల వెనుక టాలీవుడ్ హీరో ప్రభాస్ ఉన్నాడట. ఈ విషయాన్ని ఇషాన్ కిషన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. "బాహుబలి సినిమాలోని రాజు ఎక్కడున్న రాజే అనే డైలాగ్ నాపై చాలా ప్రభావాన్ని చూపించింది. ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనపై మనకు ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటం ముఖ్యమని అర్థమైంది. కెరీర్‌లో ఎదురైన అడ్డంకులు, విమర్శలు అన్నింటికి ఆటతోనే సమాధానం చెప్పాలని ధైర్యంగా ముందుకు సాగా" అని ఇషాన్ కిషన్ అన్నాడు. బాహుబలి తనకు స్ఫూర్తినిచ్చిందంటూ ఈషాన్ కిషన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ – సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్న హాట్ బ్యూటీ
మే 21, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Sreeleela | టీమిండియా క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్ – రూమర్లలో నిజమెంత?
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



