Pakistan | పాకిస్థాన్‌కు వాన గండం.. ఒక్క మ్యాచూ ఆడకుండానే టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమిస్తుందా?
Pakistan | మరికాసేపట్లో టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆథిత్యం ఇస్తున్న ఈ టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. పాకిస్థాన్ (Pakistan), నెదర్లాండ్స్ మ్యాచ్‌తో ఈ మెగాటోర్నీ ఆరంభం కానుంది.
Pakistan | త్రినేత్ర.న్యూస్: మరికాసేపట్లో టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆథిత్యం ఇస్తున్న ఈ టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. పాకిస్థాన్ (Pakistan), నెదర్లాండ్స్ మ్యాచ్‌తో ఈ మెగాటోర్నీ ఆరంభం కానుంది. అయితే పాకిస్థాన్‌కు వాన గండం పొంచి ఉన్నది. ఒక్క మ్యాచూ ఆడకుండానే ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ జట్టు తన మ్యాచ్లన్నింటినీ శ్రీలంకలో ఆడుతుండటమే కారణం.
భారత్‌లో తాము ఆడేది లేదని మొండిపట్టుపట్టడంతో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలోని (Sri Lanka) కొలంబో, పల్లెకిలె స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించింది. దీంతో పాక్‌కు మిగిలింది మూడు మ్యాచ్‌లు మాత్రమే. వాటిలో తప్పనిసరిగా గెలవడంతోపాటు మెరుగైన నెట్ రన్‌రేటు ఉండాలి. అయితే పాక్ ఆడే మ్యాచ్‌లకు వాన (Rain) ముప్పు పొంచి ఉన్నది.
కొలంబోలోని సింహలే స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్ ఆడుతున్నది. అక్కడ ఉదయం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం కొలంబోలో 68 శాతం వాన పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో ఒక వేళ మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ రానుంది. పాక్ ఆ తర్వాత ఆడనున్న మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలించనుందని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది.
ఇక గ్రూప్-ఏ లోని మిగిలిన జట్లు నెదర్లాండ్స్, అమెరికా, నమీబియా, భారత్ మ్యాచ్‌లు ఇండియాలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఒక్క మ్యాచూ ఆడకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉన్నది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






