త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ipl Auction | కామెరూన్ గ్రీన్‌కు జాక్‌పాట్ – ఐపీఎల్ వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఫారిన్ ప్లేయ‌ర్‌గా రికార్డ్‌

Ipl Auction | ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియ‌న్ ఆల్‌రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశాడు. వేలంలో అత‌డిని 25.20 కోట్ల‌కు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్ట‌రీలో కాస్ట్‌లీ ఫారిన్ ప్లేయ‌ర్‌గా గ్రీన్ రికార్డ్ సృష్టించాడు.

N

Sports | Published On Dec 16, 2025, 3.52 pm IST

Ipl Auction | కామెరూన్ గ్రీన్‌కు జాక్‌పాట్ – ఐపీఎల్ వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఫారిన్ ప్లేయ‌ర్‌గా రికార్డ్‌

కామెరూన్ గ్రీన్

Advertisement

Ipl Auction |  ఐపీఎల్ (Ipl )మినీ వేలంలో ఆస్ట్రేలియ‌న్ ఆల్‌రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) చ‌రిత్ర‌ను సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఫారిన్ ప్లేయ‌ర్‌గా నిలిచాడు. దుబాయ్‌లోని అబుదాబిలో గురువారం ఐపీఎల్ మినీ వేలం మొద‌లైంది. ఈ వేలంలో ఇండియాతో పాటు వివిధ దేశాల‌కు చెందిన 359కిపైగా క్రికెట‌ర్లు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు.
కామెరూన్ గ్రీన్ రికార్డ్‌...
ఐపీఎల్ మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ భారీ ధ‌ర ప‌లికే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అనుకున్న‌ట్లుగానే అత‌డి కోసం అన్ని ఫ్రాంచైజ్‌లు పోటీప‌డ్డాయి. బేస్ ధ‌ర రెండు కోట్ల‌తో వేలంలో నిలిచిన గ్రీన్‌ను కొనేందుకు మొద‌ట‌ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆస‌క్తిని చూపించాయి. మ‌ధ్య‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా రేసులోకి రావ‌డంతో గ్రీన్ ధ‌ర పెరుగుతూ పోయింది.
చివ‌ర‌కు 25.20 కోట్ల‌కు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌... కామెరూన్ గ్రీన్‌ను ద‌క్కించుకుంది. ఐపీఎల్ హిస్ట‌రీలోనే మూడో కాస్ట్‌లీ ప్లేయ‌ర్‌గా గ్రీన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అత‌డి కంటే ముందు రిష‌బ్ పంత్ (27 కోట్లు), శ్రేయ‌స్ అయ్య‌ర్ (26.75 కోట్లు) అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయారు.
ఐపీఎల్ హిస్ట‌రీలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఫారిన్ ప్లేయ‌ర్‌గా గ్రీన్ నిలిచాడు. గ‌తంలో ఈ రికార్డ్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. 2024 వేలంలో స్టార్క్‌ను 24.75 కోట్ల‌కు కొనుగోలు చేసింది. స్టార్క్‌ను వ‌దిలేసిన కేకేఆర్...గ్రీన్ కోసం అత‌డి కంటే ఎక్కువ ధ‌ర‌ను వెచ్చించ‌డం గ‌మ‌నార్హం.
25 కోట్ల‌కు ద‌క్కేది..ప‌ద్దెనిమిది కోట్లే...
మినీ వేలంలో గ్రీన్ 25.20 కోట్లు ప‌లికిన అత‌డికి ద‌క్కేది మాత్రం 18 కోట్లేన‌ట‌. ఫారిన్ ప్లేయ‌ర్ గ‌రిష్ట ధ‌ర...రిటెన్ష‌న్ స్లాబ్ వాల్యూ తో పాటు వేలంలో హ‌య్యెస్ట్ ప్రైజ్‌ను దాట‌కూడ‌ద‌నే రూల్ ఉంది. రిటెన్ష‌న్ స్లాబ్ వాల్యూ 18 కోట్లుగా ఉంది...ఐపీఎల్ వేలంలో పంత్ అత్య‌ధిక ధ‌ర 27 కోట్లు కాబ‌ట్టి అంత‌కుమించి ఫారిన్ ప్లేయ‌ర్ కోసం ఖ‌ర్చే చేయ‌రాద‌నే నిబంధ‌న విధించారు. రిటెన్ష‌న్ స్లాబ్ ప్ర‌కారం గ్రీన్‌కు 18 కోట్లే ద‌క్కుతాయి. గ్రీన్‌కు మొత్తం రాక‌పోయినా ఫ్రాంచైజ్ ప‌ర్స్ నుంచి అత‌డిని ఎంత‌కైతే కొన్నారో అంత త‌గ్గిస్తార‌ట‌. బీసీసీఐ వెల్ఫేర్ ఫండ్‌కు ఆ మిగిలిన మొత్తాన్ని అందించ‌నున్నారు

Advertisement

తాజావార్తలు

Advertisement