త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala | తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌.. నవంబర్‌లో విశేష ప‌ర్వ‌దినాలు ఇవే..

Tirumala | శ్రీవారి దర్శనానికి నవంబర్‌లో తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ తేదీలను గుర్తుంచుకోండి. వచ్చే నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, పెద్దశేష వాహన సేవ, పుష్పయాగం, కార్తీక దీపోత్సవం సహా పలు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్ నెలలో నిర్వహించనున్న పర్వదినాల జాబితాను టీటీడీ విడుద‌ల చేసింది.

P

Devotional | Published On Oct 31, 2026, 5.36 pm IST

Tirumala | తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌.. నవంబర్‌లో విశేష ప‌ర్వ‌దినాలు ఇవే..
Advertisement

Tirumala | శ్రీవారి దర్శనానికి నవంబర్‌లో తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ తేదీలను గుర్తుంచుకోండి. వచ్చే నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, పెద్దశేష వాహన సేవ, పుష్పయాగం, కార్తీక దీపోత్సవం సహా పలు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్ నెలలో నిర్వహించనున్న పర్వదినాల జాబితాను టీటీడీ విడుద‌ల చేసింది.

  • నవంబర్ 2న తిరుమల నంబి ఉత్సవారంభం.
  • నవంబర్ 4న మనవాళ మహామునుల ఉత్సవారంభం.
  • నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.
  • నవంబర్ 11న తిరుమల నంబి శాత్తుమొర.
  • నవంబర్ 13న నాగుల చవితి, శ్రీవారి పెద్దశేష వాహన సేవ, మనవాళ మహామునుల శాత్తుమొర.
  • నవంబర్ 14న సేనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం.
  • నవంబర్ 15న శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
  • నవంబర్ 16న శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి, పిళ్లై లోకాచార్య, పోయ్ గై ఆళ్వార్ల వర్ష తిరు నక్షత్రాలు.
  • నవంబర్ 19న యాజ్ఞవల్క్య జయంతి.
  • నవంబర్ 21న కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి.
  • నవంబర్ 24న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.
  • నవంబర్ 25న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

ట్యాగ్స్:

Andhra PradeshChakra Theertha MukkotiDeepavali AsthanamNovember FestivalsSpecial DaysTelugu NewsTirumalaTTD
Advertisement
Advertisement