త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | ప్రాంఛైజీలకు గాయాల బెడద.. టోర్నీ నుంచి నలుగురు అవుట్‌..!

IPL 2026 | ఐపీఎల్‌ 19వ సీజన్‌కు సమయం దగ్గరపడుతున్నది. టోర్నీ ప్రారంభానికి మరో వారం రోజులే ఉంది. ఈ క్రమంలో కీలక జట్లకు కీలక ఆటగాళ్ల గాయాలు తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలో టోర్నీకి ముందు నలుగురు స్టార్ ప్లేయర్లు టోర్నీకి దూరమయ్యారు. మరికొందరు ప్రారంభ మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు.

P

Sports | Published On Mar 21, 2026, 2.35 pm IST

IPL 2026 | ప్రాంఛైజీలకు గాయాల బెడద.. టోర్నీ నుంచి నలుగురు అవుట్‌..!
Advertisement

IPL 2026 | ఐపీఎల్‌ 19వ సీజన్‌కు సమయం దగ్గరపడుతున్నది. టోర్నీ ప్రారంభానికి మరో వారం రోజులే ఉంది. ఈ క్రమంలో కీలక జట్లకు కీలక ఆటగాళ్ల గాయాలు తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలో టోర్నీకి ముందు నలుగురు స్టార్ ప్లేయర్లు టోర్నీకి దూరమయ్యారు. మరికొందరు ప్రారంభ మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. ఐపీఎల్‌ ఈ నెల 28న ప్రారంభం కానుంది. టోర్నీ మొదలుకాక ముందు హర్షిత్‌ రాణా, సామ్‌ కర్రన్‌తో పాటు మరో ఇద్దరు ఈ సీజన్‌కు దూరమయ్యారు. మరో 11 మంది పలు మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. ఇందులో విదేశీ ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. గాయపడ్డ వారిలో ఫాస్ట్‌ బౌలర్లు, ఆల్‌రౌండర్లే ఎక్కువగా ఉన్నారు. అందులో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఇందులో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ తొలి రౌండ్‌ మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో ఫ్రాంచైజీ ఇషాన్‌ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మిచెల్ స్టార్క్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్ టోర్నమెంట్ టోర్నీలో ఆడతారా? లేదా అన్నది సందేహాస్పదంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్ ఎల్లిస్ మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అలాగే, ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ తొలి మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. అలాగే, రాజస్థాన్‌ రాయల్స్‌కు సైతం షాక్‌ తగిలింది. ఆల్‌ రౌండర్‌ సామ్‌ కర్రన్‌ టోర్నీకి మొత్తం దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్, చెన్నై జట్లకు ఆడిన 27 ఏళ్ల ఈ ఆటగాడిని, ఐపీఎల్ 2023 సీజన్ కోసం పంజాబ్ జట్టు రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది కెప్టెన్ సంజు సామ్సన్ స్థానంలో రాజస్థాన్ జట్టు అతన్ని చెన్నై నుంచి ట్రేడ్ డీల్‌లో తీసుకుంది.

పంజాబ్ కింగ్స్ జట్టు సభ్యుడు, న్యూజిలాండ్ ఆటగాడు లాకీ ఫెర్గూసన్‌కు సగం మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. కుటుంబంతో సమయం గడిపేందుకు టోర్నీలో కొన్ని మ్యాచులే ఆడనున్నాడు. అయితే, గాయాలు, తొలి మ్యాచ్‌ల నుంచి ఆటగాళ్లు వైదొలగడం వంటివి ఫ్రాంచైజీల జట్టు కూర్పును దెబ్బతీశాయి. ఆటగాళ్ల వైదొలగడంతో హైదరాబాద్, కోల్‌కతా జట్లు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. హైదరాబాద్ బౌలింగ్ ఆల్ రౌండర్, ఆస్ట్రేలియాకు చెందిన జాక్ ఎడ్వర్డ్స్ మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. కెప్టెన్ పాట్ కమిన్స్, ఇషాన్ మలింగ తొలి రౌండ్‌కు దూరం కానున్నారు. అయితే, కమిన్స్‌ టోర్నీలో చివరి వరకు ఆడతాడా? లేదా అన్నది ఇంకా సందేహాస్పదంగా ఉంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌కు సైతం గాయం కారణంగా దూరమయ్యాడు. కమిన్స్ ప్రస్తుతం 2027 వన్డే ప్రపంచ కప్‌కు సిద్ధమవ్వడం, టెస్ట్ మ్యాచులు ఆడడంపై దృష్టి సారించాడు.

బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రహ్మాన్‌ను జట్టు కేకేఆర్‌ తప్పించడంతో ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అతని స్థానంలో జింబాబ్వేకు చెందిన బ్లెస్సింగ్‌ ముజరబానిని జట్టులోకి తీసుకుంది. ఆ తర్వాత హర్షిత్‌ రాణా సైతం గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరంకావడంతో ఆ జట్టుకు మరో షాక్‌ తగిలినట్లయ్యింది. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరానాను తీసుకునేందుకు యోచిస్తోంది. అయితే, శ్రీలంక బోర్డు నుంచి ఎన్ఓసీ జారీ చేయాల్సి ఉంది. ఎలాగైనా ఈ సారి టైటిల్‌ను నెగ్గాలని భావిస్తున్న ఢిల్లీకి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కీలక ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తొలి దశ మ్యాచులు ఆడడం లేదు. అక్షర్ పటేల్ జట్టు ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. టైటిల్‌ను కాపాడుకోవాలని యోచిస్తున్న ఆర్‌సీబీకి జోష్‌ హేజిల్‌వుడ్‌ ప్రారంభ మ్యాచులు ఆడడం లేదు. చివరి దశలోనైనా ఆడుతాడా లేదా అన్ని ఇంకా సందేహాస్పదంగానే ఉంది. అతను సైతం టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement