Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఓనర్ కావ్య మారన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఈ జంట వివాహం జరుగనుందట. స్పెయిన్‌ను పెళ్లి వేదికగా ఖరారు చేసినట్లు సమాచారం.
Entertainment | Published On May 21, 2026, 3.03 pm IST
Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ , ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఓనర్ కావ్య మారన్ ప్రేమలో ఉన్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లి డేట్‌తో పాటు వివాహ వేదిక కూడా ఖరారైందట..
న్యూయార్క్ ట్రిప్...
అనిరుధ్, కావ్య మారన్ మధ్య గత ఏడాది కాలంగా సీక్రెట్ లవ్‌స్టోరీ సాగుతున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం వీరిద్దరు న్యూయార్క్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ న్యూయార్క్ ట్రిప్‌తోనే వీరి రహస్య ప్రేమాయణం బయటపడింది. తమ ప్రేమబంధాన్ని నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్లేందుకు ఈ జంట రెడీ అయ్యారట.
డెస్టినేషన్ వెడ్డింగ్...
అనిరుధ్ కావ్య మారన్ ప్రేమాయణం గురించి ఇరు కుటుంబసభ్యులకు తెలుసునని సమాచారం. పెద్దల అంగీకారంతో ఈ జంట ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. నవంబర్‌లో అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి జరుగనుందట. ఇద్దరి జాతకాల దృష్ట్యాను నవంబర్ నెలలో ముహూర్తం ఫిక్స్ చేశారట. స్పెయిన్‌లో గ్రాండ్‌గా వివాహ వేడుక జరుగనున్నట్లు చెబుతోన్నారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇరువురి కుటుంబసభ్యులతో పాటు కొంతమంది కోలీవుడ్ సినీ ప్రముఖులు అటెండ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే వీరి పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
రజనీకాంత్ మేనల్లుడిగా...
రజనీకాంత్ మేనల్లుడిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్. కొలవెరి పాటతో ఫేమస్ అయిన అనిరుధ్ తక్కువ టైమ్‌లోనే తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. తెలుగు, తమిళంలో విజయ్, రజనీకాంత్, అజిత్, ధనుష్ పాటు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలకు అనిరుధ్ అందించిన పాటలు పెద్ద హిట్టయ్యాయి. ప్రస్తుతం దక్షిణాదిలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ కొనసాగుతోన్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ నిర్మించిన పలు సినిమాలకు అనిరుధ్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు. ఆ టైమ్‌లోనే కావ్య మారన్‌తో అనిరుధ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.
ఐపీఎల్‌తో క్రేజ్...
ఐపీఎల్ ద్వారా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది కావ్య మారన్. ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కు సహ యజమానిగా వ్యవహరిస్తోన్న కావ్య మారన్ ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరవుతుంటుంది. మ్యాచ్ జరుగుతోన్న టైమ్‌లో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, సెలబ్రేషన్స్ పలు మార్లు వైరల్ అయ్యాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026

Trisha | త్రిషకు ఇష్టమైన ఫుడ్ ఇదేనట – సీక్రెట్ రివీల్ చేసిన స్టైలిస్ట్
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



