IPL 2026 | ఐపీఎల్ జట్లను భయపెడుతున్న గాయాలు..!
IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభానికి ముందు జట్లను ప్లేయర్ల గాయాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్లేయర్లు మొత్తం సీజన్ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. మరికొందరు సీజన్ మధ్యలో ఆయా జట్లతో చేరే అవకాశం ఉంది.
IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభానికి ముందు జట్లను ప్లేయర్ల గాయాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్లేయర్లు మొత్తం సీజన్ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. మరికొందరు సీజన్ మధ్యలో ఆయా జట్లతో చేరే అవకాశం ఉంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్, టీ20 వరల్డ్ కప్ కారణంగా ప్రముఖ ఆటగాళ్లంతా గాయాల బారినపడ్డారు. టోర్నీ నుంచి తప్పుకున్న ఆటగాళ్ల స్థానంలో పలు జట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

కోల్‌కతా నైట్‌రైడర్స్
- ఆకాశ్ దీప్ లోయర్ బ్యాక్ స్ట్రెస్ గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ తప్పుకున్నాడు.
- హర్షిత్ రాణా మోకాలి ఆపరేషన్ నుంచి కోలుకుంటున్నాడు. అయితే, సీజన్ మధ్యలో, చివరలో జట్టుతో చేరే అవకాశం ఉంది.
- టీ20 వరల్డ్ కప్ సమయంలో కాల్ఫ్ గాయం బారినపడ్డ మతిషా పతిరానా ఏప్రిల్ మధ్యలో జట్టుతో చేరే ఛాన్స్ ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్
- పాట్ కమిన్స్ వెన్ను సమస్యతో బాధపడుతున్నాడు. టోర్నీ మధ్యలో ఆడే అవకాశం ఉంది.
- జాక్ ఎడ్వర్డ్స్ కాలి గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్
- సామ్ కర్రన్ గ్రోయిన్ గాయం కారణంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్
- హామ్‌స్ట్రింగ్ గాయం తిరగబెట్టడంతో నాథన్ ఎల్లిస్ టోర్నీ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్
- మిచెల్ స్టార్క్ సైతం సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా తని పనిభారాన్ని పరిశీలిస్తోంది. ఆడేందుకు అనుమతిస్తే సీజన్ మధ్యలో జట్లుతో చేరనున్నాడు.
పంజాబ్ కింగ్స్
- లాకీ ఫెర్గూసన్ ఫిట్‌గానే ఉన్నా కుటుంబంతో సమయం గడిపేందుకు ప్రారంభ మ్యాచులకు దూరం కానున్నాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- ఫాస్ట్ బౌలర్ జోష్ హాజెల్‌వుడ్ గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు.
ఐపీఎల్ మిగిలింది ఆరు రోజులే..
ఇటీవల బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 28న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి దశ 20 మ్యాచులు పది నగరాల్లో జరుగనున్నాయి. బెంగళూరు, ముంబయి, గువాహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్‌లో మ్యాచులు జరుగనున్నాయి. తొలిదశలో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి. మధ్యాహ్నం మ్యాచ్ 3.30 గంటలకు, సాయంత్రం మ్యాచ్ 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆర్‌సీబీ హోం మ్యాచులను ఐదు బెంగళూరులో, మరో రెండు రాయ్‌పూర్‌లో ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ నాలుగు న్యూ చండీగఢ్‌లో, మూడు ధర్మశాలలో ఆడుతుంది. రాజస్థాన్ రాయల్స్ మూడు గువాహటిలో, నాలుగు జైపూర్ నగరంలో ఉంటాయి.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Preity Zinta | ఎనిమిదేళ్ల తర్వాత కెమెరా ముందుకు ఐపీఎల్ ఓనర్ – వైబ్‌తో రీఎంట్రీ
మే 19, 2026

IPL Play-off Scenario | చెన్నై ప్లేఆఫ్ ఆశలు సజీవం.. కానీ గుజరాత్, హైదరాబాద్‌ను దాటాల్సిందే..!
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



