IPL Play-off Scenario | చెన్నై ప్లేఆఫ్ ఆశలు సజీవం.. కానీ గుజరాత్, హైదరాబాద్‌ను దాటాల్సిందే..!
IPL Play-off Scenario | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 తుది అంకానికి చేరింది. 70 లీగ్ మ్యాచుల్లో 59 పూర్తయ్యాయి. ప్లేఆఫ్ కోసం పలు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభంలో ఎదురైన ఓటములతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారాయి.
IPL Play-off Scenario | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 తుది అంకానికి చేరింది. 70 లీగ్ మ్యాచుల్లో 59 పూర్తయ్యాయి. ప్లేఆఫ్ కోసం పలు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభంలో ఎదురైన ఓటములతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమిపాలైంది. అప్పటి వరకు మంచి స్థితిలో కనిపించిన ఆ జట్టుకు రాబోయే రెండుమ్యాచులు సవాల్‌గా మారాయి. ఎల్ఎస్‌జీపై ఓటమితో పాయింట్ల పట్టికలో ఒక స్థానం కోల్పోయి ఆరోస్థానికి చేరుకుంది.
ప్రస్తుతం సీఎస్‌కే ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. చెన్నై ఓటమి కారణంగా రాజస్థాన్ రాయల్స్ ఐదో స్థానానికి చేరుకుంది. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎనిమిది, ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్‌కేకు కేవలం రెండు లీగ్ మ్యాచ్‌లో మిగిలున్నాయి. ఈ రెండు ఆ జట్టుకు కీలకం కానున్నాయి. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై తలపడాల్సిన ఉంది. ప్లేఆఫ్‌లో రెండు జట్ల గట్టి పోటీ ఇస్తున్నాయి. సాధారణంగా చూస్తే సీఎస్‌కే ప్లేఆఫ్స్ ఆశలను నిలబెట్టుకోవాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిందే. గెలిస్తే చెన్నై పాయింట్లు 16కి పెరుగుతాయి. అంతటితోనే ప్లేఆఫ్‌లో అవకాశం దక్కే అవకాశం లేదు. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. సీఎస్‌కేకు రాజస్థాన్ రాయల్స్ గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ ఖాతాలో 11 మ్యాచ్‌లకు 12 పాయింట్లు ఉన్నాయి.
ఇక ఆ జట్టు ఢిల్లీ, లక్నో, ముంబయిలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ విజయం సాధిస్తే సీఎస్‌కేకు ప్లేఆఫ్స్ తలుపులు దాదాపు మూసుపోకుపోతాయి. పంజాబ్ కింగ్స్ కూడా ముందంజలో ఉంది. ఆ జట్టు మిగిలిన మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ, లక్నోలను ఎదుర్కోవాల్సి ఉంది. పంజాబ్ కనీసం ఒక మ్యాచ్‌లో ఓడిపోతే సీఎస్‌కేకు లాభం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుత సమీకరణాలను బట్టి చూస్తే ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు దాదాపుగా అర్హత సాధించినట్లే కనిపిస్తున్నాయి. మిగతా రెండు స్థానాల కోసమే సీఎస్‌కేతో మిగతా జట్లు పోటీపడుతున్నాయి. చెన్నై సెమీస్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






