త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanju Samson | రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ని వీడ‌డంపై స్పందించిన సంజు శాంస‌న్‌..!

Sanju Samson | భార‌త జ‌ట్టు స్టార్ వికెట్ కీప‌ర్ కం బ్యాట్స్‌మెన్ సంజు శాంస‌న్ ఈసారి ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఆడ‌నున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున ఆడిన విష‌యం తెలిసిందే. అయితే, ట్రేడ్ డీల్‌లో సీఎస్‌కే అత‌న్ని తీసుకుంది. ఆర్ఆర్ జ‌ట్టు అత‌న్ని వ‌దిలేయ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

P

Sports | Published On Mar 17, 2026, 6.39 pm IST

Sanju Samson | రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ని వీడ‌డంపై స్పందించిన సంజు శాంస‌న్‌..!
Advertisement

Sanju Samson | భార‌త జ‌ట్టు స్టార్ వికెట్ కీప‌ర్ కం బ్యాట్స్‌మెన్ సంజు శాంస‌న్ ఈసారి ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఆడ‌నున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున ఆడిన విష‌యం తెలిసిందే. అయితే, ట్రేడ్ డీల్‌లో సీఎస్‌కే అత‌న్ని తీసుకుంది. ఆర్ఆర్ జ‌ట్టు అత‌న్ని వ‌దిలేయ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఇటీవ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. అయితే, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను వీడ‌డంపై సంజు తొలిసారిగా స్పందించాడు. జ‌ట్టులో త‌న స‌మ‌యం ముగిసింద‌ని భావించాన‌ని.. అందుకే ఆ జ‌ట్టును వ‌దిలేసిన‌ట్లుగా పేర్కొన్నారు. సంజు శాంస‌న్ 2013 నుంచి 15 వ‌ర‌కు రాజ‌స్థాన్ త‌ర‌ఫున ఆడాడు. ఆ త‌ర్వాత ఢిల్లీ డేర్ డేవిల్స్ (ప్ర‌స్తుత ఢిల్లీ క్యాపిట‌ల్స్‌) జ‌ట్టు త‌ర‌ఫు రెండు సీజ‌న్ల‌లో ఆడి.. మ‌ళ్లీ 2018లో తిరిగి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుతో చేరాడు. మొత్తం 177 ఐపీఎల్ మ్యాచుల్లో 139.04 స్ట్ర‌యిక్ రేట్‌తో 4704 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలున్నాయి.

ధోనితో క‌లిసి ఆడ‌డంపై..

మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర ధోనితో క‌లిసి ఆడ‌డంపై సంతోషంగా ఉంద‌ని తెలిపాడు. మ‌హి భాయ్‌తో చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడాన‌ని. భార‌త జ‌ట్టు క్యాంప్‌లోనూ చూశాన‌ని.. కానీ, ఒకే జ‌ట్టులో ఆడ‌డం ఇదే తొలిసార‌ని, కాబ‌ట్టి చాలా ఉత్సాహంగా ఉంద‌ని పేర్కొన్నాడు. ఈ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ జ‌ట్టును ఎదుర్కోవ‌డాన్ని స్పందిస్తూ.. ఇలాంటి ప‌రిస్థితి ముందెన్న‌డు ఎదురుకాలేద‌ని, ఐపీఎల్‌లో ఆర్ఆర్ త‌ర‌ఫున ఆడిన తాను తొలిసారి ప్ర‌త్య‌ర్థిగా ఆడ‌బోతున్నాన‌ని తెలిపాడు. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాక భావోద్వేగాల‌పై దృష్టి పెట్ట‌లేన‌ని పేర్కొన్నాడు.

ఫుల్ ఫామ్‌లో శాంస‌న్‌..

టీ20 వరల్డ్ కప్‌లో సంజు శాంస‌న్ కీలక పాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్‌పై 97 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాత సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 89, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 89 రన్స్ చేశాడు. ముఖ్యంగా ఫైన‌ల్‌లో అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిపి తొలి వికెట్‌కు 98 ప‌రుగుల భాగ‌స్వామ్యం న‌మోదు చేశాడు. ఫైన‌ల్‌లో భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల న‌ష్టానికి 255 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్‌ను 159 పరుగులకే అవుట్ చేస్తూ 96 రన్స్ విజయాన్ని న‌మోదు చేసింది. ఇదిలా ఉండ‌గా.. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్‌కే జ‌ట్టులో ధోనీ, డెవాల్డ్ బ్రేవిస్, ఆయూష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, అంశుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ప్రశాంత్ వీర్, రాహుల్ ఛాహర్ త‌దిత‌ర ఆట‌గాళ్లు ఉన్నారు. ఈ సారి ఎలాగైనా టైటిల్‌ను సాధించాల‌నే క‌సితో ఉంది. ఐపీఎల్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 30న రాజ‌స్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement