IPL 2026 | ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి షాక్.. సీజన్ నుంచి ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ అవుట్..!
IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయం దగ్గరపడుతున్నది. ఈ నెల 28న తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే ఆ జట్టుకు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ దూరమయ్యాడు.
IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయం దగ్గరపడుతున్నది. ఈ నెల 28న తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే ఆ జట్టుకు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబత్ వెల్లడించారు. ఇప్పటికే జోష్ హేజిల్‌వుడ్ గాయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రారంభ మ్యాచులకు దూరమయ్యే అవకాశాలున్నాయి. తాజాగా యశ్ సైతం దూరం కావడం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది.
యశ్ దయాల్ వ్యక్తి కారణాలతో తప్పుకుంటున్నట్లు ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్ట్ పేర్కొన్నారు. అయితే, ఈ సారి జట్టుతో చేరడం లేదని, అతను ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ తెలిసినవేనన్నారు. ఇప్పటి వరకు అతనికి తాము అండగా నిలిచామని, ఇందులో భాగంగా వేలానికి ముందు రిటైన్ చేసుకున్నామన్నారు. జట్టు కొనసాగించాలనుకున్నా.. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా జట్టులో ఉండడం మంచిది కాదని.. ఈ సీజన్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, అతనికి తాము అండగా ఉంటామన్నారు. గత సీజన్‌లో యశ్ దయాల్ 13 వికెట్లతో ఆర్‌సీబీ విజేతగా నిలువడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇదిలా ఉండగా.. యశ్ దయాల్ ప్రస్తుతం పలు కేసుల్లో చిక్కుకున్నాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు రాగా.. వేర్వేరు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్‌లో ఒకటి, జైపూర్‌లో పోక్సో చట్టం కింద మరో కేసు నమోదైంది. బాధితుల్లో ఒకరు మైనర్ కావడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో దయాల్‌ను అరెస్టు చేయొద్దంటూ అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. రాజస్థాన్‌లో నమోదైన కేసులో బెయిల్‌పై ఉన్నాడు. ఇదిలా ఉండగా.. గత నెలలో యశ్ దయాల్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను దయాల్ ఖండించాడు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






