Ipl | కోహ్లి టీమ్‌లోకి వెంకటేష్ అయ్యర్ – అమ్ముడుపోని పృథ్వీషా, సర్ఫరాజ్ ఖాన్
ఐపీఎల్ 2026 మినీ వేలం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మినీ వేలంలో ఫారిన్ ప్లేయర్లు రికార్డు ధర పలుకుతున్నారు. కామెరూన్ గ్రీన్ 25.20 కోట్లకు అమ్ముడుపోగా...శ్రీలంక క్రికెట్ మతీషా పతిరన 18 కోట్ల ధర పలికాడు. పలువురు ఇండియన్ ప్లేయర్లు మాత్రం అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.
పృథ్వీషా
Ipl | ఐపీఎల్ మినీ వేలంలో టీమిండియా ప్లేయర్లకు నిరాశే ఎదురవుతుంది. ఫారిన్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకే ఫ్రాంఛైజ్‌లు ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ 25.20 కోట్లకు అమ్ముడుపోగా...శ్రీలంక పేసర్ మతీషా పతిరన 18 కోట్ల ధరపలికాడు. ఇండియన్ ప్లేయర్స్ మాత్రం ఇప్పటివరకు ఎవరూ పది కోట్లు కూడా దాటలేదు.
మినీ వేలంలో ఇండియా నుంచి మొదటగా పృథ్వీ షా (Prithvi Shaw) వేలంలోకి వచ్చాడు. కానీ అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజ్ ఆసక్తిని చూపించలేదు. బేస్ ధర 75 లక్షలతో వేలంలో పృథ్వీ షా నిలిచాడు. ఇటీవల దేశవాళీలో పరుగుల వరద పారించాడు. అయినా ఫ్రాంఛైజ్‌లు మాత్రం ఈ ప్లేయర్ వైపు కన్నెత్తి చూడలేదు. గత వేలంలో పృథ్వీ షా అన్‌సోల్డ్ ప్లేయర్‌గానే మిగిలిపోయాడు.
పృథ్వీషా తో పాటు మరో టీమిండియా ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడుపోలేదు.
అప్పుడు 23.75 కోట్లు...ఇప్పుడు ఏడు కోట్లు...
ఐపీఎల్ 2024 వేలంలో వెంకటేష్ అయ్యర్‌ను (Venkatesh Iyer) 23.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఈ హిట్టర్ కోసం కోల్‌కతా భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కానీ రికార్డ్ ధరకు మాత్రం వెంకటేష్ అయ్యర్ న్యాయం చేయలేకపోయాడు. దాంతో అతడిని కోల్‌కతా రిటైన్ చేసుకోలేదు. మినీ వేలంలో వెంకటేష్ అయ్యర్‌ను ఏడు కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. కోహ్లి టీమ్‌లోకి బెంగళూరు క్రికెటర్ చేరాడు.
స్పిన్నర్ రవి బిష్టోయ్ని 7.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్‌కు అమ్ముడుపోయాడు. గత వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు రవి బిష్టోయ్. అప్పుడు 11 కోట్లకు లక్నో టీమ్ అతడిని దక్కించుకుంది. గత సారితో పోలిస్తే ఈ సారి తక్కువ ధరే పలికాడు.
దేశవాళీలో మెరుపులు మెరిపించిన టీమ్ ఇండియా పేసర్ ఆకాష్ దీప్తో పాటు ఇండియన్ ప్లేయర్లు శివమ్ మాది, దీపక్ హుడా, యశ్ దుళ్, ఆర్య దేశాయ్, రాహుల్ చాహర్ అన్‌సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోయారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్






