Prithvi Shaw | పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్..
Prithvi Shaw | టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి ఆకృతి అగర్వాల్‌తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.
Prithvi Shaw | టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి ఆకృతి అగర్వాల్‌తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆకృతి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘నా ఫియాన్సీ, నేను వేర్వేరు భవిష్యత్ లక్ష్యాలు, పరిస్థితుల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఒకరిపై ఒకరికి ప్రేమ, శ్రద్ధ ఉన్నప్పటికీ.. మా మార్గాలు కలిసి సాగాల్సినవి కావని నిర్ణయానికి వచ్చాం. ప్రస్తుతం మేం ఎదుర్కొంటున్న పరిస్థితులు, మా బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆకృతి పేర్కొంది. ఇక ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాలని, విడిపోవడానికి గల కారణాలపై ఎలాంటి ఊహాగానాలు వద్దని ఆమె కోరింది.
ఇద్దరికీ భవిష్యత్తులో శాంతి, సంతోషం కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ మార్చి 8, 2026న నిశ్చితార్థం చేసుకున్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఆకృతి చేసిన ప్రకటన ఆ వార్తలకు స్పష్టతనిచ్చినట్లయ్యింది. ఇదిలా ఉంటే.. పృథ్వీ షా చాలాకాలంగా భారత జట్టుకు దూరమయ్యాడు. 26 ఏళ్ల షా ఒకప్పుడు భారత క్రికెట్‌లో భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018లో 18 ఏళ్ల వయసులో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన షా.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు షా ప్రయత్నిస్తున్నాడు.
View this post on Instagram
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Supreme Court | హిందీ విషయంలో మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.. తమిళనాడు సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం
- ●Tamannaah | నా హీరోల్లో అతడే హ్యాండ్సమ్ - కియారా అద్వానీ భర్తపై తమన్నా పొగడ్తలు
- ●Graduate MLC Elections Voters Schedule Release | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల
- ●Brahmotsavam | తిరుమలలో వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై మలయప్ప విహారం
- ●Amazon | అమెజాన్ భారీ డీల్.. జనరాక్ షేర్లు ఏకంగా 40 శాతం జంప్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..

Supreme Court | హిందీ విషయంలో మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.. తమిళనాడు సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం

Tamannaah | నా హీరోల్లో అతడే హ్యాండ్సమ్ - కియారా అద్వానీ భర్తపై తమన్నా పొగడ్తలు

Graduate MLC Elections Voters Schedule Release | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల





