త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!

ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ హామీలు నెరవేర్చి రావాలని డిమాండ్ చేశారు.

J

Medak | Published On Nov 16, 2026, 9.45 pm IST

Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!

సంక్షిప్త సారాంశం

ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ విడుదల చేశారు. గత పర్యటనల్లో ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, రూ.9 వేల కోట్ల రైతు భరోసా హామీలను నెరవేర్చి సిద్దిపేటకు వస్తే తానే స్వయంగా బొకే ఇచ్చి స్వాగతం పలుకుతానని హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో రద్దు చేసిన వెటర్నరీ కాలేజీతో పాటు నిలిపివేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో అవాస్తవాలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు.

Advertisement
  • సీఎం రేవంత్ సిద్దిపేట టూర్ వేళ హరీశ్ రావు బహిరంగ లేఖ

Revanth Reddy Siddipet Visit | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనకు రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు బహిరంగ లేఖ విడుదల చేశారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. గత పర్యటనల్లో సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నిలిపివేసిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని ప్రజల పక్షాన డిమాండ్ చేశారు.

రుణమాఫీ, రైతు భరోసా హామీలు నెరవేర్చాలి

ముఖ్యమంత్రి సిద్దిపేటకు వస్తున్నారంటే మేలు జరుగుతుందని ప్రజలు ఆశిస్తారని.. గతంలో కేసీఆర్ వస్తే మల్లన్న సాగర్, మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ వంటివి ప్రారంభించారని హరీశ్ రావు గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి రెండుసార్లు సిద్దిపేటకు వచ్చినా ఒక్క మేలూ జరగలేదని విమర్శించారు.

Harish Rao Releases Open Letter to CM Revanth Reddy Ahead of Nov 19 Siddipet Visit

రుణమాఫీ లెక్కలు: 2024 మే 2న అంబేద్కర్ చౌరస్తాలో కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, మూడు ఆగస్టు 15లు గడిచినా పూర్తిస్థాయిలో మాఫీ కాలేదని హరీశ్ రావు ఆరోపించారు. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే 20,514 మందికి మాఫీ అయితే, ఇంకా 22,819 మందికి కాలేదని తెలిపారు.

రైతు భరోసా జాప్యం: రెండోసారి 2026 మార్చి 22న కేసీఆర్ నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు 45 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా వేస్తామని చెప్పి, 230 రోజులు గడిచినా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ హామీలను నెరవేర్చి సిద్దిపేటకు వస్తే తానే స్వయంగా బొకే ఇచ్చి స్వాగతం పలుకుతానని హరీశ్ రావు పేర్కొన్నారు.

Harish Rao Releases Open Letter to CM Revanth Reddy Ahead of Nov 19 Siddipet Visit

వెటర్నరీ కాలేజీ రద్దు, రూ.1,070 కోట్ల పనుల నిలిపివేతపై ఆగ్రహం

కేసీఆర్ మంజూరు చేసి పనులు జరుగుతున్న సిద్దిపేట వెటర్నరీ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే (2024 ఫిబ్రవరి 29న) రద్దు చేసి కొడంగల్‌కు తరలించారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ కాలేజీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే సిద్దిపేట ప్రాంతానికి మంజూరైన ఔటర్ రింగ్ రోడ్డు (రూ.160 కోట్లలో 90% పనులు పూర్తి), బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ, శిల్పారామం, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్, స్పోర్ట్స్ స్టేడియం, ఆడిటోరియం, వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ, రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టు, పోలీస్ స్టేషన్ భవనాలు, వెజ్-నాన్ వెజ్ మార్కెట్ సహా మొత్తం రూ.1,070 కోట్ల పనులను నిలిపివేశారని, వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.

సిద్దిపేటపై వివక్ష తగదు

రాష్ట్రంలోని 87 నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లను మంజూరు చేసి, సిద్దిపేటకు ఎందుకు ఇవ్వలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సిద్దిపేట పాఠశాలల్లో నిలిపివేశారని, రిబ్బన్ కట్ చేసి ఏడాదైనా 50 పడకల ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సేవలు మొదలుపెట్టలేదని విమర్శించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల, పొన్నం పరామర్శించి వెళ్లినా, ఇప్పటివరకు ఒక్క పైసా పరిహారం అందలేదని అన్నారు.

Harish Rao Releases Open Letter to CM Revanth Reddy Ahead of Nov 19 Siddipet Visit

సాగునీటి కాలువలు, మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలు

మల్లన్న సాగర్ నిర్వాసితులకు కోర్టు స్టేలు క్లియర్ అయినా మూడేళ్లుగా పరిహారం ఇవ్వడం లేదని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయకపోవడం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ కాలువల తవ్వకాన్ని నిలిపివేయడం వల్ల జిల్లాకు కృత్రిమ కరువు తెచ్చారని ఆరోపించారు. 95 శాతం పూర్తయిన ఇర్కోడ్ లిఫ్ట్ పథకం మిగిలిన 5 శాతం పనులను, 50 శాతం పూర్తయిన తపాస్‌పల్లి కాలువ పనులను, గౌరవెల్లి రిజర్వాయర్ కాలువలను పూర్తి చేసి రైతులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు.

ఆరు గ్యారెంటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చిన ప్రభుత్వం.. రూ.4 వేల పింఛన్ కింద ఒక్కో అవ్వాతాతకు రూ.72 వేలు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున రూ.90 వేలు బాకీ పడిందని హరీశ్ రావు విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.600 కోట్లు కూడా ఇవ్వకపోవడంతో 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

Harish Rao Releases Open Letter to CM Revanth Reddy Ahead of Nov 19 Siddipet Visit

కాళేశ్వరంపై ఢిల్లీ వ్యాఖ్యలకు కౌంటర్

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి, సీడబ్ల్యూసీ ఇచ్చిన లేఖలను, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ అభ్యంతరాలను అసెంబ్లీ సాక్షిగా చూపించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కమీషన్లు తీసుకున్నారని, మూడేళ్ల పాలనలో కృష్ణా జలాల్లో అత్యల్ప నీటిని ఎత్తిపోయడం వల్లే వానాకాలంలో 25 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆరోపించారు. కొడంగల్‌లో ఓడించానన్న కోపాన్ని సిద్దిపేట ప్రజలపై చూపొద్దని, ఇచ్చిన హామీలను నెరవేర్చి సీఎం కుర్చీ గౌరవాన్ని కాపాడుకోవాలని హరీశ్ రావు హితవు పలికారు.

Advertisement
Advertisement