Sachin Tendulkar | సచిన్‌తో ఓపెన్‌ఏఐ పార్ట్‌నర్‌షిప్.. చాట్‌జీపీటీ ద్వారా కీలక భాగస్వామ్యం..
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యం ప్రకటించారు. సోమవారం ఎక్స్‌లో చేసిన పోస్టు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన సచిన్.. ఆసక్తికరమైన విషయాలు రాబోతున్నాయంటూ పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్‌తో బహుళ సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రారంభించినట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది.
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యం ప్రకటించారు. సోమవారం ఎక్స్‌లో చేసిన పోస్టు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన సచిన్.. ఆసక్తికరమైన విషయాలు రాబోతున్నాయంటూ పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్‌తో బహుళ సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రారంభించినట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. భారత్‌లోని ప్రజలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో కృత్రిమ మేధస్సు, చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించుకోవచ్చో చూపించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశంగా పేర్కొంది. సచిన్‌తో రూపొందించే కంటెంట్, ప్రచార కార్యక్రమాలు, ప్రత్యేక అనుభవాల ద్వారా చాట్‌జీపీటీ వినియోగాన్ని ప్రజలకు పరిచయం చేయనున్నారు.
ఏఐ నాకు ఎంతో మేలు చేసింది: సచిన్
తనకు ఉన్న సహజమైన ఆసక్తి కారణంగా ఒక ప్రశ్న నుంచి మరో ప్రశ్నకు వెళ్లే అలవాటు ఉందని సచిన్ తెలిపారు. చాట్‌జీపీటీ ఈ ఆసక్తిని మరింత ప్రోత్సహించిందని చెప్పారు. తన చివరి కుటుంబ పర్యటనను ప్రణాళిక చేసుకోవడం సహా పలు ఆచరణాత్మక పనుల్లో ఈ కృత్రిమ మేధస్సు సాధనం తనకు ఉపయోగపడిందని వెల్లడించారు.
చాట్‌జీపీటీ ద్వారా ఆసక్తి ఉన్న అంశాల గురించి తెలుసుకోవడం, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం వంటి ఆచరణాత్మక ఉపయోగాలను ప్రజలకు చూపించడంపై ఈ భాగస్వామ్యం దృష్టి సారించనుంది. ఈ భాగస్వామ్యంపై సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఒక ప్రశ్న, ఒక ఆలోచన, మీరు ఎప్పటినుంచో అన్వేషించాలనుకున్న విషయం.. ప్రారంభించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కలిసి అన్వేషించేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●National Conference | జాతీయ రబీ సదస్సులో తెలంగాణ ప్రగతి
- ●Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే
- ●NSE | ఎన్ఎస్ఈ షేర్లకు తొలి ఎదురుదెబ్బ.. ఐపీఓ ధర కంటే దిగువకు..
- ●Vithya Ramraj | ఆసియా గేమ్స్‌లో విత్య రామ్రాజ్ మెరుపులు.. పీటీ ఉష రికార్డు బద్దలు..!
- ●Chiranjeevi | ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - సినిమాలకు మించి రెమ్యూనరేషన్?
- ●True Caller | ట్రూకాలర్ కొత్త టూల్.. ఫోన్ నంబర్, లింక్, మెసేజ్‌లను చెక్ చేయొచ్చు..

National Conference | జాతీయ రబీ సదస్సులో తెలంగాణ ప్రగతి

Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే

NSE | ఎన్ఎస్ఈ షేర్లకు తొలి ఎదురుదెబ్బ.. ఐపీఓ ధర కంటే దిగువకు..

Vithya Ramraj | ఆసియా గేమ్స్‌లో విత్య రామ్రాజ్ మెరుపులు.. పీటీ ఉష రికార్డు బద్దలు..!






