INDW Vs SLW | 4వ టీ20లోనూ భారత్ విజయం.. పోరాడి ఓడిన శ్రీలంక..
INDW Vs SLW | కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన మహిళల టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు కాస్త వెనుకబడింది. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోయింది. దీంతో చేయాల్సిన పరుగుల సంఖ్య పెరిగింది.
INDW Vs SLW | కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన మహిళల టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు కాస్త వెనుకబడింది. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోయింది. దీంతో చేయాల్సిన పరుగుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని ఛేదించలేక వెనుకబడింది. మరోవైపు భారత బౌలర్లు కూడా చివరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేశారు. దీంతో శ్రీలంకపై భారత్ సునాయాసంగానే గెలుపొందింది. శ్రీలంకపై 30 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన కారణంగా భారత్ ప్రస్తుతం సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో ఉంది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత ప్లేయర్లు తొలి వికెట్‌కు ఏకంగా రికార్డు స్థాయిలో 162 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. దీంతో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. ఆ తరువాత వచ్చిన ప్లేయర్లు కూడా ధాటిగా ఆడారు. దీంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో భారత ప్లేయర్లలో ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన అర్థ సెంచరీలతో చెలరేగిపోయారు. 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో మంధాన 80 పరుగులు చేయగా, 46 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో షఫాలీ 79 పరుగులు చేసింది, అలాగే చివర్లో రిచా ఘోష్ 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి మెరుపులు మెరిపించింది. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇక లంక బౌలర్లలో మల్షా షెహాని, నిమాషా మీపగెలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం 222 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు హాసిని పెరెరా, చమారి ఆటపట్టు జట్టుకు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని తక్కువ ఓవర్లలోనే నమోదు చేశారు. 20 బంతుల్లో హాసిని 7 ఫోర్లతో 33 పరుగులు చేయగా, 37 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్సర్లతో ఆటపట్టు 52 పరుగులు చేసింది. అయితే ఆ తరువాత వచ్చిన ప్లేయర్లు ఎవరూ నిలకడగా ఆడలేకపోయారు. దీంతో లంక జట్టు వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 191 పరుగులు చేయగలిగింది. దీంతో భారత్ విజయం సాధించింది. ఇక భారత్ బౌలర్లలో అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లను తీయగా, శ్రీచరణికి 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో సిరీస్‌లో 4-0 ఆధిక్యానికి చేరుకుంది. ఇక చివరిదైన 5వ టీ20 ఈ నెల 30వ తేదీన ఇదే వేదికలో జరగనుంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌దే విజయం.. ఆస్ట్రియన్ సైనిక నిపుణుడి సంచలన వ్యాఖ్యలు..!
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



