త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ODI World Cup | వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌పై భార‌త్ దృష్టి.. 20 మందితో ప్రాబ‌బుల్స్‌..!

ODI World Cup | ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ది. ఈ మెగా టోర్నీకి టీమిండియా ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇందుకోసం 20 మంది ఆట‌గాళ్ల‌తో సెల‌క్ష‌న్ క‌మిటీ ప్రాబ‌బుల్స్ సిద్ధం చేసింది. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో ఆయా ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌పై దృష్టి సారించ‌నున్నారు.

P

Sports | Published On Mar 20, 2026, 6.46 pm IST

ODI World Cup | వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌పై భార‌త్ దృష్టి.. 20 మందితో ప్రాబ‌బుల్స్‌..!
Advertisement

ODI World Cup | ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ది. ఈ మెగా టోర్నీకి టీమిండియా ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇందుకోసం 20 మంది ఆట‌గాళ్ల‌తో సెల‌క్ష‌న్ క‌మిటీ ప్రాబ‌బుల్స్ సిద్ధం చేసింది. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో ఆయా ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌పై దృష్టి సారించ‌నున్నారు. చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని క‌మిటీలో ఎస్ఎస్ దాస్‌, ఆర్పీ సింగ్‌, అజ‌య్ రాత్రా, ప్ర‌జ్ఞాన్ ఓజా స‌భ్యులుగా ఉన్నారు.

రాబోయే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే, న‌మీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. టోర్నీ వ‌చ్చే ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జ‌రుగ‌నున్న‌ది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో సెలెక్టర్లు ప్రత్యక్షంగా, టీవీల ద్వారా మ్యాచుల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ఇదిలా ఉండ‌గా.. చీఫ్ సెలెక్ట‌ర్ అగార్క‌ర్ త‌న ప‌ద‌వీకాలాన్ని వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు పొడ‌గించాల‌ని కోరిన‌ట్లుగా వ‌చ్చిన వార్త‌ల‌ను బీసీసీఐ వ‌ర్గాలు ఖండించాయి. బీసీసీఐకి చెందిన ఓ సీనియ‌ర్ అధికారి మాట్లాడుతూ.. సెలెక్ట‌ర్ల ఒప్పందాలు ఈ ఏడాది సెప్టెంబ‌ర్ వ‌ర‌కు మాత్ర‌మే ఉండ‌నుంది. అగార్కర్ ఒప్పందం కూడా అప్పటితో ముగియ‌నుంది. ఆ త‌ర్వాత కొనసాగాలా వద్దా అన్నది బీసీసీఐ కార్యదర్శి, అగార్క‌ర్ క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటారు. అగార్కర్ 2023 జూలైలో ప్రధాన సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ వంటి దిగ్గజాలు రిటైర్మెంట్ తీసుకున్న త‌ర్వాత టెస్ట్, టీ20 జట్ల మార్పు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాడు

టెస్ట్ జట్టు ఎంపిక

ఈ ఏడాది జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్‌పూర్‌లో అఫ్ఘ‌నిస్తాన్ టీమ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు కూడా ఉత్తమ జట్టును ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు మాత్రం ఇవ్వ‌రు. ఇక 50 ఓవర్ల ఫార్మాట్‌కు అనువైన ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, వారి ఫిట్‌నెస్, ప్రదర్శనలను ఐపీఎల్‌లో ప‌రిశీలిస్తారు.

వ‌న్డే జ‌ట్టులో స్థానం కోసం జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ట‌, అర్ష్‌దీప్ సింగ్‌, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. యువ పేసర్ హ‌ర్షిత్ రాణా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు మరికొంత సమయం అవసరమని తెలుస్తోంది. వ‌న్డే వరల్డ్‌కప్ లక్ష్యంగా టీమిండియా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం గమనార్హం.

Advertisement

తాజావార్తలు

Advertisement