IND vs NZ | గౌహతి టీ20లో టీమిండియా టార్గెట్ 154 రన్స్.. దంచికొడుతున్న ఇషాన్ కిషన్, అభిషేక్..!
IND vs NZ | గౌహతి వేదిక జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు రాణించారు. జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ విజృంభించడంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
IND vs NZ | గౌహతి వేదిక జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు రాణించారు. జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ విజృంభించడంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే న్యూజిలాండ్‌కు షాక్ తగిలింది. పవర్ ప్లేలోనే కీలక మూడు వికెట్లు కోల్పోయింది. మొదటి ఓవర్లో ఓపెనర్ డెవాన్ కాన్వే (1) వికెట్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రచిన్ రవీంద్ర (4)ని హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించాడు. బుమ్రా టిమ్ సీఫర్ట్(12)ను తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఒక దశలో 32 పరుగులకు మూడు వికెట్లు పడి ఇబ్బందుల్లోపడ్డ ఆ జట్టును గ్లెన్ ఫిలిప్స్, మార్క్ ఆదుకున్నారు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. గ్లెన్ ఫిలిప్స్(48), మార్చ్ చాప్‌మన్ (32), కెప్టెన్ మిచెల్ శాంట్నర్(27) జట్టును ఆదుకున్నారు. దాంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో బుమ్రాకు మూడు, రవి బిష్ణోయ్ 2, హర్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణాకు ఒక వికెట్ దక్కింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు తొలి ఓవర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సంజు శాంసన్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం టీమిండియా 2.4 ఓవర్లలో 38 పరుగులు చేసింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






