త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | జింబాబ్వేతో కీల‌క పోరు.. తుది జ‌ట్టు నుంచి ముగ్గురికి ఉద్వాస‌న‌..?

T20 World Cup | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్ 8 మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా చేతిలో ఘోర ప‌రాజ‌యం పాలైన భార‌త్ మ‌ళ్లీ తిరిగి పుంజుకోవాల‌ని చూస్తోంది. చెన్నై ఎంఏ చిదంబ‌రం వేదిక‌గా గురువారం కీల‌క మ్యాచ్ ఆడ‌నున్న‌ది. సెమీస్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించాల్సి ఉంటుంది.

P

Sports | Published On Feb 25, 2026, 4.25 pm IST

T20 World Cup | జింబాబ్వేతో కీల‌క పోరు.. తుది జ‌ట్టు నుంచి ముగ్గురికి ఉద్వాస‌న‌..?
Advertisement

T20 World Cup | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్ 8 మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా చేతిలో ఘోర ప‌రాజ‌యం పాలైన భార‌త్ మ‌ళ్లీ తిరిగి పుంజుకోవాల‌ని చూస్తోంది. చెన్నై ఎంఏ చిదంబ‌రం వేదిక‌గా గురువారం కీల‌క మ్యాచ్ ఆడ‌నున్న‌ది. సెమీస్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేసింది. ముఖ్యంగా అక్ష‌ర్ ప‌టేల్‌పై దృష్టి పెట్టింది. చివ‌రి రెండు మ్యాచుల‌కు అక్ష‌ర్ ప‌టేల్‌ను దూరంగా పెట్టిన విష‌యం తెలిసిందే. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

తుది జ‌ట్టులో మార్పులు చేస్తారా..?

జింబాబ్వేతో మ్యాచ్ కోసం అక్ష‌ర్ ప‌టేల్ నెట్స్‌తో చ‌మ‌టోడ్చాడు. జింబాబ్వేతో జ‌రిగే మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ తిరిగి జ‌ట్టులో చేరే అవ‌కాశాలున్నాయి. ద‌క్షిణాఫ్రికాతో అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. పవర్‌ప్లేలో దక్షిణాఫ్రికాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్లు క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్‌లను త్వ‌ర‌గంగా పెవిలియ‌న్‌కు పంపేందుకు ఆఫ్ స్పిన్న‌ర్‌ను తీసుకోవాల‌ని భావించారు. అయితే, ఇద్ద‌రిని బుమ్రా త్వ‌ర‌గానే పెవిలియ‌న్‌కు చేర‌డంతో భార‌త్ వ్యూహం విఫ‌ల‌మైంది. అక్ష‌ర్ ప‌టేల్ ఆడిన మూడు మ్యాచుల్లో 12.16 సగటు, 6.63 ఎకానమీతో ఆరు వికెట్లు పడగొట్టాడు.

శాంస‌న్‌ను తీసుకుంటారా..?

అదే స‌మ‌యంలో వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతూ వ‌స్తున్న ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ను ప‌క్క‌న‌పెడ‌తారా? లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ్యాచులు ఆడిన అభిషేక్ శ‌ర్మ మూడుసార్లు డ‌కౌట్ అయ్యాడు. చివ‌రి ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు. అయితే, టీమ్ మేనేజ్‌మెంట్ అభిషేక్ శ‌ర్మ‌పై న‌మ్మ‌కం పెట్టుకున్న‌ది. మూడుసార్లు డ‌కౌట్ అయినా తిరిగి తుది జ‌ట్టులో చోటు క‌ల్పించింది. అభిషేక్ ఫామ్‌పై ప‌లు ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా.. కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ మ‌ద్ద‌తుగా నిలిచాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శాంస‌న్ కేవ‌లం ఒకే మ్యాచ్ ఆడాడు. న‌మీబియాపై 22 ప‌రుగులు చేశాడు. అలాగే, మ‌రో టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ తిల‌క్ వ‌ర్మ‌ను సైతం ప‌క్క‌నె పెట్టే అవ‌కాశం ఉంది. తిల‌క్ సైతం భారీ ఇన్నింగ్స్ ఆడ‌లేక‌పోతుండ‌డం టీమిండియా క‌ల‌వ‌ర‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో అభిషేక్‌, తిల‌క్‌లో ఎవ‌రినైనా త‌ప్పించి శాంస‌న్‌కు తుది జ‌ట్టులో చోటు క‌ల్పిస్తారా? లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

బ్యాటింగ్ పిచ్‌..

జింబాబ్వేతో జరిగే మ్యాచ్ కోసం చెన్నై బ్యాటింగ్ పిచ్‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. బంతి బ్యాట్‌పైకి సులభంగా వస్తుందని, దాంతో బ్యాట‌ర్స్‌కు తేలిగ్గా షాట్లు ఆడేందుకు అనుకూలంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. జింబాబ్వేతో మ్యాచ్లో భార‌త్ భారీ తేడాతో విజ‌యం సాధిస్తేనే సెమీస్‌కు అవ‌కాశాలుంటాయి. ఆ తర్వాత వెస్టిండీస్‌తో ఆడాల్సి ఉంటుంది. రెండింట్లో గెలిస్తేనే టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉంటాయి. గ్రూప్‌లో ద‌క్షిణాఫ్రికా మిగ‌తా మ్యాచుల్లో విజ‌యం సాధిస్తే.. భార‌త్ నేరుగా సెమీస్‌లోకి వెళ్తింది. వెస్టిండీస్ చేతిలో ద‌క్షిణాఫ్రికా ఓడితే స‌మీక‌ర‌ణాలు మారిపోతాయి. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మూడు జట్లు 4 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. దాంతో ర‌న్‌రేట్ కీల‌క‌మ‌వుతుంది.

Read Also :

T20 World Cup 2026 | సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్ వేదిక‌ల‌పై ఫ్యాన్స్‌లో అయోమ‌యం.. టిక్కెట్ల‌ను కొనాలా, వ‌ద్దా..?

IPL 2026 | త్వ‌ర‌లో ఐపీఎల్‌.. కొత్త లోగోతో ల‌క్నో జ‌ట్టు..

Advertisement
Advertisement