త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | త్వ‌ర‌లో ఐపీఎల్‌.. కొత్త లోగోతో ల‌క్నో జ‌ట్టు..

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ది. ఈ నేప‌థ్యంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స‌రికొత్త లోగోతో ముందుకు వ‌చ్చింది. మంగళవారం ఫ్రాంచైజీ కొత్త లోగోను ఆవిష్క‌రించింది.

P

Sports | Published On Feb 24, 2026, 8.59 pm IST

IPL 2026 | త్వ‌ర‌లో ఐపీఎల్‌.. కొత్త లోగోతో ల‌క్నో జ‌ట్టు..
Advertisement

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ది. ఈ నేప‌థ్యంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స‌రికొత్త లోగోతో ముందుకు వ‌చ్చింది. మంగళవారం ఫ్రాంచైజీ కొత్త లోగోను ఆవిష్క‌రించింది. నీలం రంగు స్థానంలో ముదురు ఎరుపును.. లోగోలో ఈగిల్ వింగ్స్‌, కిరీటం, ఏనుగు ఫొటోల‌తో క‌లిపి లోగోను తీర్చిదిద్దింది. జట్టు ఆత్మ, నగర స్ఫూర్తి, అభిమానుల గౌరవాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన‌ట్లు పేర్కొంది. ఈ డిజైన్ సంజీవ్ గోయెంకా గ్రూప్‌కు చెందిన ఫుట్‌బాల్ జట్టు 'మాంచెస్టర్ సూపర్ జెయింట్స్' లోగోను పోలి ఉంటుంది.

ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో లోగో కేవలం రూపం మాత్రమే మార్పు కాదు కాద‌ని.. అది లక్నో నగరం, ఉత్తరప్రదేశ్, అభిమానుల మనసును ప్రతిబింబించే గుర్తింపుగా పేర్కొంది. ఈ సంద‌ర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ ఓన‌ర్ శాశ్వత్ గోయెంకా మాట్లాడుతూ “ఈ లోగో మాకు భావోద్వేగమైంది. గరుడ పక్షి ఉన్నతత‌కు చేరాలన్న మన ఆశ, కిరీటం అభిమానుల గౌరవాన్ని, ఏనుగు ఈ ప్రాంత ప్రజల బలం, విశ్వాసానికి ప్ర‌తీక‌గా పేర్కొన్న‌ది. ఇది కేవలం గుర్తింపు మార్పు కాదు.. నగర గౌరవాన్ని నిలబెట్టే సంకేతంగా అభివ‌ర్ణించారు. రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో జట్టు, నికోలస్ పూరన్, మహ్మద్ షమీ, మిచెల్ మార్ష్ లాంటి సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఉన్నారు. ఐపీఎల్ మార్చి నెలాఖ‌రు నుంచి ప్రారంభం కానున్న‌ది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఎల్ఎస్‌జీ స‌న్నాహకాలు ప్రారంభించ‌బోతున్న‌ది.

Advertisement
Advertisement