త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND vs SA 3rd T20I | 3వ టి20లో భారత్​ అలవోక విజయం : హార్థిక్​ రికార్డు

ధర్మశాల మూడో టి20లో భారత బౌలర్లు సౌతాఫ్రికాను 117 పరుగులకే కట్టడి చేశారు. ఛేజింగ్‌లో అభిషేక్–గిల్ దూకుడు, తిలక్–దూబే ముగింపుతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

a

Sports | Published On Dec 14, 2025, 10.29 pm IST

IND vs SA 3rd T20I | 3వ టి20లో భారత్​ అలవోక విజయం : హార్థిక్​ రికార్డు
Advertisement

India beat South Africa by 7 wickets in 3rd T20I; Hardik Pandya creates historic world record

ధర్మశాలలో జరిగిన మూడో టి20 క్రికెట్​ మ్యాచ్​లో ఊహించినట్లుగానే, భారత్​ దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

(త్రినేత్ర స్పోర్ట్స్​ డెస్క్​)ధర్మశాల, డిసెంబర్ 14, 2025:

IND vs SA 3rd T20I | ఇక్కడ జరిగిన భారత్–దక్షిణాఫ్రికా 3వ అంతర్జాతీయ టీ20 క్రికెట్​ పోటీలో అనుకున్నట్లుగానే ఇండియా భారీ విజయం సాధించింది. టాస్​ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్​ చేసిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 117 పరుగులకే కుప్పకూలి, భారత్​కు గెలుపు అవకాశాలను బార్లా తెరిచింది. విజయానికి అవసరమైన 118 పరుగులను కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించి, సిరీస్​లో 2 – 1 ఆధిక్యం దక్కించుకుంది.

ALSO READ : భారత్ vs దక్షిణాఫ్రికా 3వ టీ20ఐ: సౌతాఫ్రికా 117కే ఆలౌట్

చేధనకు దిగిన భారత్​కు శుభారంభమే దక్కింది. షరామామూలుగా ఇన్నింగ్స్​ అభిషేక్​ శర్మ బ్యాటింగ్​ విధ్వంసంతో మొదలవ్వగా, వైస్​కెప్టెన్​ గిల్​ తోడుగా నిలిచాడు. అభిషేక్​ దంచుడుతో 5 ఓవర్లలో 50 పరుగులకు చేరుకున్న ఇండియా, 60 పరుగులకు మొదటి వికెట్​గా శర్మ(33 పరుగులు, 3 సిక్స్​లు, 3 ఫోర్లు)ను కోల్పోయింది.  అనంతరం కెప్టెన్​ను కాదని మూడోస్థానంలో వచ్చిన తిలక్​వర్మ, గిల్​ నింపాదిగా ఆడుతూ స్కోరును పెంచుకుంటూ పోయారు. 12వ ఓవర్లో గిల్​ (28 ) జాన్సెన్​ బంతికి బౌల్డవ్వగా.. కెప్టెన్​ సూర్య(12) కాసేపటికి క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన శివం దూబే(10 నాటౌట్​), తిలక్​(26 నాటౌట్​) ఇక మరో వికెట్​ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.

అంతకుముందు, టాస్​ గెలిచిన భారత్, మంచు వాతావారణాన్ని బాగా వాడుకుని బౌలింగ్​లో ప్రొటీస్​ను బెంబేలెత్తించింది. అర్షదీప్​, రాణా, కుల్​దీప్​ ప్రత్యర్థి తలా 2 వికెట్లతో వెన్నువిరవగా, ఆల్​రౌండర్​ హార్థిక్​ పాండ్యా టి20ల్లో 100వ వికెట్​ తీసుకుని, ప్రపంచ రికార్డు స్థాపించాడు. టి20ల్లో ఆల్​రౌండర్​గా బ్యాటింగ్​లో 1000 పరుగులు, 100 వికెట్లు సాధించిన మొదటి ఫాస్ట్​ బౌలింగ్ ఆల్​రౌండర్​గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement