త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs PAK | కుర్రాళ్లు ఉతికి ఆరేస్తారు.. రాక‌పోవ‌డ‌మే మంచిది.. పాకిస్తాన్‌పై మాజీ కెప్టెన్ సెటైర్లు..!

P

Sports | Published On Jan 26, 2026, 6.28 pm IST

IND Vs PAK | కుర్రాళ్లు ఉతికి ఆరేస్తారు.. రాక‌పోవ‌డ‌మే మంచిది.. పాకిస్తాన్‌పై మాజీ కెప్టెన్ సెటైర్లు..!
Advertisement

IND Vs PAK | ఫిబ్ర‌వ‌రి 7న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానున్న‌ది. ఐసీసీ టోర్నీలో భార‌త్‌-పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. రెండు జ‌ట్లు ఫిబ్ర‌వ‌రి 15న శ్రీ‌లంకలో మ్యాచ్ ఆడుతాయి. ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభానికి ముందు భార‌త్‌-పాక్ మ‌ధ్య వైరం పెరుగుతోంది. బంగ్లాదేశ్‌కు మ‌ద్ద‌తుగా పాకిస్తాన్ ఊహించ‌ని విధంగా టోర్నీని బ‌హిష్క‌రిస్తామ‌ని బెదిరించింది. తాజాగా భార‌త మాజీ కెప్టెన్ కృష్ట‌మాచారి శ్రీ‌కాంత్ పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. టీ20 ప్రపంచ కప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జ‌ట్టును ఎదుర్కోవడానికి అన్ని జ‌ట్లు భ‌య‌ప‌డుతాయ‌న్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనొద్ద‌ని ఆయ‌న పాక్ జ‌ట్టుకు అడ్వైజ్ చేశారు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి బంగ్లాదేశ్‌ను త‌ప్పించ‌డాన్ని నిర‌సిస్తూ తాము సైతం బ‌హిష్క‌రిస్తామ‌ని పీసీబీ చీఫ్ మోహ్సిన్ న‌ఖ్వీ చేసిన హెచ్చ‌రిక‌ల‌పై ప్ర‌స్తావించారు.

భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న‌ది. టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారత్‌కు ఇదే చివరి సిరీస్. ఆదివారం గౌహతిలో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ కేవలం 10 ఓవర్లలోనే 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ శర్మ 14 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అంతకుముందు, రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది.

శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ గత మ్యాచ్‌లో భారత్ 15 ఓవర్లలో 209 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 150 పరుగులు చేసింది. 'ఇది చూసి చాలా జట్లు మేం రావ‌డం లేదు. మీరే క‌ప్పు ఉంచుకోండి అని చెప్పొచ్చు' అని చెప్పొచ్చు. హాయ్ పాకిస్తాన్ మీరూ రాకండి. మీ మోహ్సిన్ న‌ఖ్వీ చెబుతున్నాడు క‌దా రావొద్దు. మీకు దారుణంగా దెబ్బ‌లు త‌గులుత‌య్‌. కొలంబోలో కొట్టిన సిక్స్ మద్రాస్‌లో పడుతుంది జాగ్రత్త. దూరంగా ఉండటమే మంచిది. ఏదో ఒక సాకు చెప్పి రాకండి. ఈ కుర్రాళ్లు పాకిస్తాన్‌ను దారుణంగా ఉతికి ఆరేస్తారు. ఇది ప్రపంచంలోని ప్రతి క్రికెట్ జట్టుకు ఒక సందేశాన్ని పంపుతుంది. టీ20 క్రికెట్‌లో తాను ఇంతకు ముందు ఇలాంటి బ్యాటింగ్ ఎప్పుడూ చూడలేదు' అంటూ శ్రీ‌కాంత్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండ‌గా.. బంగ్లాదేశ్ అంశంలో అన‌వ‌స‌రంగా పాకిస్తాన్ మ‌ధ్య‌లోకి త‌ల‌దూర్చి ఐసీసీపై కయ్యానికి కాలు దువ్వింది. వాస్తవానికి, ఐసీసీ బంగ్లాదేశ్ డిమాండ్‌ను తిరస్కరించి, ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ నుంచి త‌ప్పించి.. స్కాట్లాండ్‌కు చోటు క‌ల్పించింది. ఇది పాక్‌కు ఏమాత్రం మింగుప‌డలేదు. పీసీబీ చీఫ్ నఖ్వీ ఐసీసీపై పక్షపాతం ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఒక రకంగా నఖ్వీ టీ20 ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తామని బెదిరింపుల‌కు దిగారు. కానీ, త‌న మాట‌ల‌పై వెన‌క్కి త‌గ్గి చివ‌ర‌కు టోర్నీ కోసం జ‌ట్టును ప్ర‌క‌టించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement