త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aditya Ashok | ఎవ‌రీ ఆదిత్య అశోక్‌..? న్యూజిలాండ్ జ‌ట్టులో త‌మిళ‌నాడు కుర్రాడు..!

Aditya Ashok | అత‌ని పేరు ఆదిత్య అశోక్‌. భార‌తీయు మూలాలు ఉన్న న్యూజిలాండ్ క్రికెట‌ర్‌. భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కివీ జ‌ట్టులోని కుర్రాడు. వ‌డోద‌ర వేదిక‌గా భార‌త్‌-న్యూజిలాండ్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి వ‌న్డే మ్యాచ్ తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకొని.. ఈ యువ స్పిన్న‌ర్ భార‌త అభిమానుల దృష్టిని ఆక‌ర్షించాడు. ప్ర‌స్తుతం ఆదిత్య అశోక్ గురించి క్రికెట్ అభిమానులు ఆస‌క్తిగా ఆరా తీస్తున్నారు.

P

Sports | Published On Jan 11, 2026, 6.22 pm IST

Aditya Ashok | ఎవ‌రీ ఆదిత్య అశోక్‌..? న్యూజిలాండ్ జ‌ట్టులో త‌మిళ‌నాడు కుర్రాడు..!
Advertisement

Aditya Ashok | అత‌ని పేరు ఆదిత్య అశోక్‌. భార‌తీయు మూలాలు ఉన్న న్యూజిలాండ్ క్రికెట‌ర్‌. భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కివీ జ‌ట్టులోని కుర్రాడు. వ‌డోద‌ర వేదిక‌గా భార‌త్‌-న్యూజిలాండ్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి వ‌న్డే మ్యాచ్ తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకొని.. ఈ యువ స్పిన్న‌ర్ భార‌త అభిమానుల దృష్టిని ఆక‌ర్షించాడు. ప్ర‌స్తుతం ఆదిత్య అశోక్ గురించి క్రికెట్ అభిమానులు ఆస‌క్తిగా ఆరా తీస్తున్నారు.

ఆదిత్య అశోక్ త‌మిళ‌నాడులోని వెల్లూరులో పుట్టాడు. నాలుగేళ్ల వయసు వరకూ భారత్‌లోనే పెరిగాడు. ఆ త‌ర్వాత ఉద్యోగాల‌తో త‌ల్లిదండ్రులు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు మ‌కాం మార్చారు. కుటుంబంతో క‌లిసి అశోక్ సైతం అక్క‌డికి వెళ్లిపోయాడు. అక్క‌డే చ‌దివిని అశోక్‌.. క్రికెట్‌ను కెరీర్‌గా మార్చుకున్నాడు. చిన్న‌నాటి నుంచే స్పిన్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణించాడు. ఈ క్ర‌మంలో 2020లో జ‌రిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జట్టుకు ఎంపిక‌య్యాడు. ఇదే అత‌ని కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత దేశవాళీ క్రికెట్‌లో స‌త్తా చాటాడు. 2021 డిసెంబ‌ర్‌లో ఆక్లాండ్ జట్టు తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. త‌క్కువ స‌మ‌యంలో అన్ని ఫార్మాట్ల‌లో జ‌ట్టుకు కీల‌కంగా మారాడు. ముఖ్యంగా 2022-23 సీజ‌న్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసి ‘న్యూజిలాండ్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు సాధించాడు.

యూఏఈ పర్యటనలో తొలిసారి న్యూజిలాండ్ జాతీయ జట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఎంపిక‌య్యాడు. కొద్దిరోజులు వెన్నెముక గాయం కారణంగా క్రికెట్‌కు దూర‌మ‌య్యాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆదిత్య రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఉపఖండ పిచ్‌ల‌కు అల‌వాటు ప‌డేందుకు 23025లో సీఎస్‌కే అకాడ‌మీలో శిక్ష‌ణ తీసుకున్నాడు. ఆదిత్య‌కు క్రికెట్‌తో పాటు సినిమాలంటే మ‌క్కువ‌. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు వీరాభిమాని. త‌న చేయిపై ర‌జ‌నీ ఫేమ‌స్ డైలాగ్ ‘ఎన్ వళి తని వళి’ని టాటూగా వేయించుకున్నాడు. ‘పదయప్ప’ సినిమాలోని డైలాగ్.. తెలుగు ‘నరసింహ’ సినిమాలో ‘నా దారి రహదారి’ బాగా గుర్తు పెట్టుకున్నాడు. ఈ మూవీని త‌న తాత‌తో క‌లిసి చూసిన చివ‌రి చిత్రం. ఆ డైలాగ్ అంటే త‌న‌కు ప్ర‌త్యేక‌మ‌ని చెప్పాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement