IND vs NZ | అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు..!
IND vs NZ | భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ శనివారం తిరువనంతపురంలో జరుగనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు సభ్యులు అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నది.
IND vs NZ | భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ శనివారం తిరువనంతపురంలో జరుగనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు సభ్యులు అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నది. కెప్టెన్ సూర్యకుమార్, ఇషాన్ కిషన్, రింకు సింగ్, రవి బిష్ణోయ్, ఇషాన్ కిషన్ సహా పలువురు ప్లేయర్లు స్వామివారిని దర్శించుకున్నారు. త్వరలో టీ20 ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక పూజలు చేశారు.
అందరి దృష్టి శాంసన్ పైనే..
టీ20 ప్రపంచకప్‌కు ముందు తిరువనంతపురంలో భారత జట్టు చివరి టీ20 మ్యాచ్ ఆడుతుంది. ఐసీసీ టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా.. మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్నది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్‌పై అందరు దృష్టి సారించారు. ఈ సిరీస్‌లో శాంసన్ ఇప్పటి వరకు పెద్దగా రాణించలేకపోయాడు. కానీ, ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సొంత మైదానంలో ఆడనున్నాడు. భారత్ ఈ సిరీస్‌లో 3-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి ప్రపంచకప్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని టీమిండియా భావిస్తున్నది.
రిజర్వ్ బెంచ్ స్ట్రెంత్‌ని..
ప్రపంచకప్‌కు ముందు భారత బ్యాటింగ్ కాంబినేషన్ దాదాపు ఖరారైంది. టీమ్ మేనేజ్‌మెంట్ కేవలం తమ రిజర్వ్ బెంచ్ స్ట్రెంత్‌ని అంచనా వేస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. గత మ్యాచ్‌లో గాయం కారణంగా దూరమైన ఇషాన్ కిషన్ చివరి మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? చూడాల్సిందే. కీలక టోర్నీకి ముందు ఇషాన్ ఫిట్‌గా ఉండడం కీలకం. ఇక అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే సైతం ఫామ్‌లో కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తున్నది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20లో వేలికి గాయమైనప్పటికీ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆడలేదు. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ విశాఖపట్నంలో జరిగిన నాల్గవ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో బౌలింగ్ సాధన చేశాడు. ఐదో టీ20లో అక్షర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమయ్యే అవకాశం ఉంది.
బౌలింగ్‌లో మార్పులు..
విశాఖపట్నంలో జరిగిన నాల్గో టీ20 మ్యాచ్‌లో భారత్ ప్రయోగాలు చేపట్టింది. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగింది. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలతో బౌలింగ్ చేయించలేదు. గత మ్యాచ్ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ మరోసారి బౌలింగ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. గత రెండు మ్యాచుల్లో వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్.. ఇక చివరి మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉన్నది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






