త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs NZ | న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. శ్రేయాస్‌, బిష్ణోయ్‌ల‌కు చోటు..

IND Vs NZ | న్యూజిలాండ్‌తో సొంత గ‌డ్డ‌పై జ‌ర‌గ‌నున్న 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఇప్ప‌టికే స్పిన్ బౌలింగ్‌ ఆల్ రౌండర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌తోపాటు బ్యాట‌ర్‌ తిల‌క్ వ‌ర్మ దూర‌మైన విష‌యం విదిత‌మే. అయితే ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌ను బీసీసీఐ మ‌రో ఇద్ద‌రితో భ‌ర్తీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

S

Cricket | Published On Jan 17, 2026, 10.47 am IST

IND Vs NZ | న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. శ్రేయాస్‌, బిష్ణోయ్‌ల‌కు చోటు..
Advertisement

IND Vs NZ | న్యూజిలాండ్‌తో సొంత గ‌డ్డ‌పై జ‌ర‌గ‌నున్న 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఇప్ప‌టికే స్పిన్ బౌలింగ్‌ ఆల్ రౌండర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌తోపాటు బ్యాట‌ర్‌ తిల‌క్ వ‌ర్మ దూర‌మైన విష‌యం విదిత‌మే. అయితే ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌ను బీసీసీఐ మ‌రో ఇద్ద‌రితో భ‌ర్తీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుంద‌ర్‌, తిల‌క్ స్థానంలో లెగ్ స్పిన్ బౌల‌ర్ ర‌వి బిష్ణోయ్‌, బ్యాట‌ర్ శ్రేయాస్ అయ్యార్‌ను తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. న్యూజిలాండ్‌తో ఈ నెల 21వ తేదీ నుంచి టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సిరీస్ కోసం అయ్య‌ర్‌, బిష్ణోయ్‌లను సుంద‌ర్‌, తిల‌క్‌ల‌కు బ‌దులుగా ఎంపిక చేస్తున్న‌ట్లు తెలిపారు. అయితే అయ్య‌ర్‌ను మాత్రం కేవ‌లం మొద‌టి మూడు టీ20ల‌కు మాత్ర‌మే తీసుకున్నామ‌ని తెలిపారు. అందువ‌ల్ల అత‌నికి చివ‌రి రెండు టీ20ల‌లో స్థానం ల‌భించ‌డం అనుమానంగా మారింది.

అయితే మ‌రోవైపు తిల‌క్ వ‌ర్మ మాత్రం సిరీస్ మొత్తానికి దూరం కాలేదు. కేవ‌లం మొద‌టి గేమ్‌ల‌కు మాత్ర‌మే అత‌ను అందుబాటులో ఉండ‌డం లేదు. క‌నుక చివ‌రి రెండు టీ20ల‌కు అయ్య‌ర్‌ను త‌ప్పించి తిల‌క్‌ను ఆడించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక సుంద‌ర్‌ను బెంగ‌ళూరులోని బీసీసీఐకి చెందిన సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ (సీవోఈ)కి పంపి అక్క‌డ అత‌న్ని ప‌ర్య‌వేక్షిస్తారు. అక్క‌డ అత‌నికి కొన్ని రోజుల పాటు విశ్రాంతిని ఇచ్చి అనంత‌రం అత‌ని ప‌రిస్థితిని స‌మీక్షిస్తారు. ఆ త‌రువాత అత‌ను జ‌ట్టులో ఆడే విష‌య‌మై నిర్ణ‌యం తీసుకుంటారు. ఇక అత‌ని స్థానంలో ఎంపికైన రవి బిష్ణోయ్ న్యూజిలాండ్‌తో మొత్తం 5 టీ20ల‌కు అందుబాటులో ఉంటాడ‌ని తెలుస్తోంది.

వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు ఈ నెల 11వ తేదీన‌ న్యూజిలాండ్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఛాతి కింది భాగంలో అసౌక‌ర్యం క‌ల‌గ‌డంతో అత‌ను టీమ్‌కు దూర‌మ‌య్యాడు. మ‌రోవైపు తిల‌క్ వ‌ర్మ శ‌స్త్ర చికిత్స కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. దీంతో అత‌ను మొద‌టి మూడు టీ20ల‌కు అందుబాటులో ఉండ‌డం లేదు. క‌నుక‌నే అత‌ని స్థానంలో మొద‌టి మూడు టీ20ల‌కు గాను అయ్య‌ర్‌ను తీసుకున్నారు. అయితే వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్థానంలో ఇప్ప‌టికే వ‌న్డే టీమ్‌కు ఆయుష్ బ‌దోనిని ఎంపిక చేశారు. కాగా శ్రేయాస్ అయ్య‌ర్, ర‌వి బిష్ణోయ్ ఇద్ద‌రూ చాలా రోజుల త‌రువాత మ‌ళ్లీ టీ20ల‌లో ఆడ‌నున్నారు. అయ్య‌ర్ చివ‌రిసారిగా 2023 డిసెంబర్‌లో సొంత గ‌డ్డ‌పై ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. ఆ త‌రువాత ఐపీఎల్ ఆడాడు కానీ.. ఇటీవ‌ల గాయం కార‌ణంగా దేశవాళీ టీ20 ట్రోఫీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్న‌మెంట్‌లోనూ ఆడ‌లేదు. ఐపీఎల్ త‌రువాత మ‌ళ్లీ ఇప్పుడే అయ్యర్ టీ20లలో ఆడ‌నున్నాడు. ఇక బిష్ణోయ్ చివ‌రిసారిగా టీమిండియాకు దాదాపుగా ఏడాది కింద‌ట ఇంగ్లండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో ఆడాడు. అయితే బిష్ణోయ్ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మొత్తం 7 మ్యాచ్‌ల‌ను ఆడి 8.72 ఎకాన‌మీతో 9 వికెట్ల‌ను తీశాడు.

ఇక అప్‌డేట్ అయిన స‌మాచారం ప్ర‌కారం న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌ల‌ను ఆడ‌నున్న భార‌త జ‌ట్టు స‌భ్యుల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. సూర్య‌కుమార్ యాద‌వ్ (కెప్టెన్‌), అభిషేక్ శ‌ర్మ‌, సంజు శాంస‌న్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్య‌ర్ (తొలి మూడు టీ20ల‌కు), హార్దిక్ పాండ్యా, శివం దూబె, అక్ష‌ర్ ప‌టేల్ (వైస్ కెప్టెన్‌), రింకు సింగ్‌, జ‌స్‌ప్రిత్ బుమ్రా, హ‌ర్షిత్ రానా, అర్ష‌దీప్ సింగ్, కుల‌దీప్ యాద‌వ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ఇషాన్ కిష‌న్ (వికెట్ కీప‌ర్), ర‌వి బిష్ణోయ్‌.

Advertisement

తాజావార్తలు

Advertisement