త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs NZ | భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య రేపు తొలి వ‌న్డే.. పంత్‌కు తుదిజ‌ట్టులో చోటు ద‌క్కేనా..?

IND Vs NZ | భార‌త జ‌ట్టు కొత్త ఏడాదిని న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ది. భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య తొలివ‌న్డే ఆదివారం వ‌డోద‌ర‌లో జ‌రుగ‌నున్న‌ది. ఈ ఏడాది టీమిండియా కీల‌కం కానున్న‌ది. వ‌చ్చే నెల‌లో ప్ర‌పంచ‌క‌ప్ సైతం జ‌రుగ‌నున్న‌ది.

P

Sports | Published On Jan 10, 2026, 6.53 pm IST

IND Vs NZ | భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య రేపు తొలి వ‌న్డే.. పంత్‌కు తుదిజ‌ట్టులో చోటు ద‌క్కేనా..?
Advertisement

IND Vs NZ | భార‌త జ‌ట్టు కొత్త ఏడాదిని న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ది. భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య తొలివ‌న్డే ఆదివారం వ‌డోద‌ర‌లో జ‌రుగ‌నున్న‌ది. ఈ ఏడాది టీమిండియా కీల‌కం కానున్న‌ది. వ‌చ్చే నెల‌లో ప్ర‌పంచ‌క‌ప్ సైతం జ‌రుగ‌నున్న‌ది. న్యూజిలాండ్‌తో జ‌రిగే ఈ ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్ కీల‌కం. భార‌త టెస్ట్‌, వ‌న్డే కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ గాయం నుంచి కోలుకొని తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌నున్నాడు. గత‌కొంత‌కాలంగా గిల్ ఫామ్‌లేమితో ఇబ్బందిప‌డుతున్నాడు. ఈ సిరీస్‌లో తిరిగి మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు.

న్యూజిలాండ్‌తో జ‌రిగే వ‌న్డే సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ త‌దిత‌ర స్టార్ ఆట‌గాళ్లు క‌నిపించ‌నున్నారు. రోహిత్‌, విరాట్ గ‌తంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ఆడారు. కోహ్లీ అద్భుతంగా రాణించి.. టీమిండియా విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. తాజాగా మ‌ళ్లీ రోకో జోడీ మ‌రోసారి అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు, రోహిత్, కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టు గిల్‌ను త‌ప్పించిన నేప‌థ్యంలో గిల్ వ‌న్డే సిరీస్‌లో ఎలా రాణిస్తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మార‌నున్న‌ది. ప్ర‌స్తుతం ఇప్ప‌టికే ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. గ‌తేడాది చివ‌రిలో గాయం కార‌ణంగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. గిల్ తిరిగి రావ‌డంతో య‌శ‌స్వీకి తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం క‌ష్టంగా క‌నిపిస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో తొలి వ‌న్డేలో సెంచ‌రీ సాధించిన విష‌జ్ఞం తెలిసిందే.

ఇదే సిరీస్‌తో శ్రేయాస్ అయ్య‌ర్ సైతం తిరిగి జ‌ట్టుతో చేరాడు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. జ‌ట్టును ప్ర‌క‌టించిన స‌మ‌యంలో అయ్య‌ర్ ఫిట్‌నెస్‌ను బ‌ట్టి తుదిజ‌ట్టులోకి తీసుకోనున్న‌ట్లు బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. ఇటీవ‌ల అయ్య‌ర్ విజయ్ హజారే ట్రోఫీలో ముంబ‌యి జట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇప్ప‌టికే అయ్య‌ర్ ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ అందుకున్నాడు. దాంతో తుదిజ‌ట్టులో ఆడేందుకు మార్గం సుగ‌మ‌మైంది. శ్రేయాస్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాల‌కు తెర‌ప‌డే ఛాన్స్ ఉంది. ఇక వికెట్ కీప‌ర్‌గా రాహుల్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ ఆస‌క్తి చూపే అవ‌కాశం ఉంది.

అయితే, జ‌ట్టులోకి రిష‌బ్ పంత్‌ని తీసుకున్నా.. ప్లేయింగ్ లెవెన్‌లో కేఎల్ రాహుల్ తొలి ఆప్ష‌న్‌గా తీసుకున్నారు. రాహుల్ లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్‌, వికెట్ కీప‌ర్‌గా తీసుకోనున్న నేప‌థ్యంలో రిష‌బ్ పంత్‌ను తుదిజ‌ట్టులోకి తీసుకోవ‌డం అవ‌కాశాలు త‌క్కువే. మ‌రో వైపు ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. ఇక బౌలింగ్ భారం సిరాజ్‌-హ‌ర్షిత్ రాణాల‌పై ప‌డ‌నున్న‌ది. బుమ్రా, పాండ్యాకు బీసీసీ విశ్రాంతి ఇచ్చింది. కుల్దీప్ యాద‌వ్‌, వాషింగ్టన్ సుందర్, జడేజా స్పిన్ భారాన్ని మోయ‌నున్నారు. సాయంత్రం మ్యాచ్ నేప‌థ్యంలో ప్లాట్ పిచ్ అయితే ఈ ఫార్మాట్‌లో దూకుడుగా వికెట్ తీయ‌డం కంటే ప‌రుగులు ఆప‌డానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. ఆల్ రౌండర్‌గా, వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్-11 సైతం చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి.

టీమిండియా తుది జ‌ట్టు (అంచ‌నా) : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా/ప్రసిద్ధ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాదవ్

న్యూజిలాండ్ జ‌ట్టు : హెన్రీ నికోల్స్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జాడెన్ లెన్నాక్స్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), జాచరీ ఫోక్స్, కైల్ జామిసన్, మైఖేల్ రే, క్రిస్ క్లార్క్.

Advertisement

తాజావార్తలు

Advertisement