త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs NZ | తొలి మ్యాచ్ లో టీమిండియా విజ‌యం.. కోహ్లికి మ‌ళ్లీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..

IND Vs NZ | మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా వడోద‌ర‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. చివ‌ర్లో వికెట్లు ప‌డి క‌ల‌వర‌పెట్టిన ఎట్ట‌కేల‌కు మ్యాచ్‌ను ఒక ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే ముగించారు.

S

Cricket | Published On Jan 12, 2026, 7.06 am IST

IND Vs NZ | తొలి మ్యాచ్ లో టీమిండియా విజ‌యం.. కోహ్లికి మ‌ళ్లీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..
Advertisement

IND Vs NZ | మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా వడోద‌ర‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. చివ‌ర్లో వికెట్లు ప‌డి క‌ల‌వర‌పెట్టిన ఎట్ట‌కేల‌కు మ్యాచ్‌ను ఒక ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే ముగించారు. బౌల‌ర్లు, బ్యాట్స్‌మెన్ స‌మిష్టి కృషితో ఈ మ్యాచ్‌లో గెలుపు త‌థ్య‌మైంది. భార‌త ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి కీల‌కంగా మారాడు. కోహ్లి 91 బంతుల్లో 93 ప‌రుగులు చేసి సెంచ‌రీని మిస్ చేసుకోగా మ‌ళ్లీ ఆయ‌న‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది. ఈ మ‌ధ్య సిరీస్‌ల‌లో కోహ్లి త‌ర‌చూ ఈ ఘ‌న‌త‌ను సాధిస్తుండ‌డం విశేషం.

మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా న్యూజిలాండ్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈక్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో వికెట్ల న‌ష్టానికి 300 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ ప్లేయ‌ర్ల‌లో డారిల్ మిచెల్ (71 బంతుల్లో 84, 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), హెన్రీ నికోల్స్ (69 బంతుల్లో 62, 8 ఫోర్లు), డివాన్ కాన్‌వే (67 బంతుల్లో 56, 6 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) రాణించారు. ఈ క్ర‌మంలోనే తొలి వికెట్‌కు న్యూజిలాండ్ ఓపెన‌ర్లు కాన్‌వే, నికోల్స్ 117 ప‌రుగుల‌ను జోడించ‌గా, ఆ త‌రువాత స్వ‌ల్ప భాగ‌స్వామ్యాల‌ను న‌మోదు చేసిన కివీస్ ప్లేయ‌ర్లు నిర్ణీత ఓవ‌ర్లు ముగిసే స‌రికి డిఫెండ‌బుల్ స్కోరు సాధించారు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో మొహ‌మ్మ‌ద్ సిరాజ్‌, హ‌ర్షిత్ రాణా, ప్ర‌సిధ్ కృష్ణ‌ల‌కు త‌లా 2 వికెట్లు ద‌క్కాయి. కుల్దీప్ యాద‌వ్ 1 వికెట్ తీశాడు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన భార‌త్ తొలి వికెట్‌ను రోహిత్ శ‌ర్మ రూపంలో కోల్పోయింది. 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 26 ప‌రుగులు చేసి భార‌త్ స్కోరు 39 ప‌రుగులు ఉన్న‌ప్పుడు ఔట‌య్యాడు. అయితే ఆ త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన కోహ్లి, గిల్ ఇద్ద‌రూ క‌లిసి రెండో వికెట్‌కు 107 బంతుల్లో 118 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఆ త‌రువాత కోహ్లి, శ్రేయాస్ అయ్య‌ర్ మళ్లీ 77 ప‌రుగుల పార్ట్‌న‌ర్ షిప్‌ను న‌మోదు చేశారు. దీంతో భార‌త్ విజ‌యం సునాయాసం అయింది. అయితే చివ‌ర్లో కివీస్ బౌల‌ర్లు వ‌రుస‌గా వికెట్లు తీయ‌డంతో భార‌త బ్యాట్స్‌మెన్ కాస్త ఒత్తిడి ఫీల‌య్యారు. కానీ చివ‌ర్లో కేఎల్ రాహుల్ క్రీజులో నిల‌బ‌డి ఇన్నింగ్స్ ముగించాడు. దీంతో 49 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌ను కోల్పోయిన భార‌త్ 306 ప‌రుగులు చేసి ల‌క్ష్యాన్ని ఛేదించింది. కివీస్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో కోహ్లి 93 ప‌రుగులు చేసి ఔట్ అవ‌గా అత‌నికి మ‌రో సెంచ‌రీ మిస్ అయింది. మొత్తం 91 బంతులు ఆడిన కోహ్లి 8 ఫోర్లు,1 సిక్స‌ర్ బాదాడు, అలాగే కెప్టెన్ గిల్ (71 బంతుల్లో 56, 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శ్రేయాస్ అయ్య‌ర్ (47 బంతుల్లో 49, 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) కూడా రాణించారు. ఈ క్ర‌మంలో భార‌త్ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు పెద్ద‌గా శ్ర‌మ‌ప‌డ‌లేదు. ఇక కివీస్ బౌల‌ర్ల‌లో కైలీ జేమీస‌న్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, ఆదిత్య అశోక్‌, క్రిస్టియన్ క్లార్క్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో భార‌త్ మూడు వ‌న్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. రెండో వ‌న్డేను జ‌న‌వ‌రి 14వ తేదీన రాజ్‌కోట్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement