IND Vs NZ T20 | ఫిలిప్స్ విధ్వంసం.. నాల్గో టీ20లో భారత్‌కు భారీ ఓటమి
IND Vs NZ T20 | న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో కివీస్ 87 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగుల భారీ స్కోరు సాధించింది.
IND Vs NZ T20 | న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో కివీస్ 87 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులకే పరిమితమైంది. దీంతో సిరీస్‌లో కివీస్ తొలి విజయాన్ని నమోదు చేయగా.. భారత్ 3-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. మయాంక్ యాదవ్ టిమ్ సీఫెర్ట్ (3), డారిల్ మిచెల్ (24)ను పెవిలియన్‌కు పంపాడు. ఫిన్ అలెన్ (31)తో కలిసి గ్లెన్ ఫిలిప్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అనంతరం మైకేల్ బ్రేస్‌వెల్‌తో కలిసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఫిలిప్స్ కేవలం 49 బంతుల్లో 107 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. 46 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు బ్రేస్‌వెల్ 25 బంతుల్లో 65 పరుగులతో మెరుపులు మెరిపించాడు. అతడి ఖాతాలో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఐదో వికెట్‌కు ఈ జోడీ కేవలం 41 బంతుల్లోనే 115 పరుగులు జోడించింది. నితీశ్ కుమార్ రెడ్డి వేసిన 16వ ఓవర్‌లో ఫిలిప్స్ 32 పరుగులు పిండుకోగా.. అక్షర్ పటేల్ ఓవర్‌లో బ్రేస్‌వెల్ చెలరేగాడు. చివరి ఐదు ఓవర్లలో కివీస్ ఏకంగా 85 పరుగులు సాధించింది. ఫలితంగా భారత్‌పై టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదు చేసింది.
తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు
260 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కివీస్ బౌలర్ జాకబ్ డఫీ తొలి ఓవర్‌లోనే సంజూ శాంసన్ (4), ఇషాన్ కిషన్ (0)ను ఔట్ చేశాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ (27) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే అభిషేక్‌ను ఫిషర్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (22) కూడా ఔటవడంతో భారత్ పవర్‌ప్లేలోనే 61 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో కోల్పోయిన వికెట్ల నుంచి భారత్ కోలుకోలేకపోయింది. డఫీ 23 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ రెండు వికెట్లు తీశాడు. దీంతో భారత్ 172/9కే పరిమితమై 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
నాలుగో టీ20లో ఓడినా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-1తో ఆధిక్యంలో ఉంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకుంది. తాజా విజయంతో న్యూజిలాండ్ పరువు నిలుపుకుంది. చివరి టీ20లోనూ గెలిచి సిరీస్‌ను ఘనంగా ముగించాలని టీమిండియా భావిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
- ●Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం
- ●Chamala Kirankumar | రైల్వే అండర్‌పాస్ కోసం రైల్వే మంత్రికి ఎంపీ చామల వినతి
- ●IIFA Awards 2026 | ఐఫా అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే - ధురంధర్‌కు 12 అవార్డులు - టాప్ ప్లేస్‌లో షారుఖ్ తనయుడి వెబ్‌సిరీస్
- ●Indian Railway | రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. ఇక ప్రీమియం రైళ్లలో హయ్యర్ క్లాస్‌లో ప్రయాణం!
- ●Yellamma Movie | వంద మంది జానపద కళాకారులతో "ఎల్లమ్మ" ఆటపాట

Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం

Chamala Kirankumar | రైల్వే అండర్‌పాస్ కోసం రైల్వే మంత్రికి ఎంపీ చామల వినతి

IIFA Awards 2026 | ఐఫా అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే - ధురంధర్‌కు 12 అవార్డులు - టాప్ ప్లేస్‌లో షారుఖ్ తనయుడి వెబ్‌సిరీస్





