Indian Railway | రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. ఇక ప్రీమియం రైళ్లలో హయ్యర్ క్లాస్‌లో ప్రయాణం!
Indian Railway | రైల్వే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో పాస్‌పై అనుమతించిన క్లాస్ కంటే.. హైక్లాస్‌లోనూ ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం రెండు క్లాస్‌ల మధ్య ఛార్జీల వ్యత్యాసాన్ని చెల్లిస్తే సరిపోతుంది.
Indian Railway | రైల్వే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో పాస్‌పై అనుమతించిన క్లాస్ కంటే.. హైక్లాస్‌లోనూ ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం రెండు క్లాస్‌ల మధ్య ఛార్జీల వ్యత్యాసాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు రైల్వే బోర్డు కీలక స్పష్టత ఇచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రివిలేజ్ పాస్ (PP), కాంప్లిమెంటరీ పోస్ట్ రిటైర్మెంట్ పాస్ (PRCP), విడో పాస్ (WP) కలిగిన వారికి వర్తించనుంది. ప్రస్తుతం రైల్వే ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన సిబ్బంది, నిబంధనల ప్రకారం వారి కుటుంబ సభ్యులు ఈ పాస్‌ల ద్వారా ప్రయాణిస్తున్నారు. ఇకపై పాస్‌పై నిర్దేశించిన క్లాస్ కంటే పై క్లాస్‌లో ప్రయాణించాలనుకుంటే పూర్తి టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం అదనపు ఛార్జీ చెల్లిస్తే చాలు.
గందరగోళానికి తెర..
రైల్వే సర్వెంట్స్ పాస్ రూల్స్-1986 ప్రకారం.. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత, రాయితీ ప్రయాణ సౌకర్యం అందుతోంది. అయితే రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో పాస్‌పై కేటాయించిన క్లాస్ కంటే హై క్లాస్‌లో అదనపు ఛార్జీ చెల్లించి ప్రయాణించవచ్చా? లేదా? అనే విషయంలో స్పష్టత లేకపోయింది. తాజాగా రైల్వే బోర్డు రూల్ 3(x), షెడ్యూల్-II కింద ఈ అంశంపై స్పష్టతనిచ్చింది. కమర్షియల్ డైరెక్టరేట్‌తో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం అమలుకు అవసరమైన మార్పులు చేపట్టాలని రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెంటర్ (CRIS)ను బోర్డు ఆదేశించింది. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS), హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (HRMS)లోని ఈ-పాస్ మాడ్యూళ్లను అప్‌డేట్ చేయాలని సూచించింది. ఈ నిర్ణయంతో గతంలో జారీ చేసిన సంబంధిత పాస్‌లు, ప్రయాణ అర్హతకు సంబంధించిన సూచనల స్థానంలో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. మొత్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు, వితంతు పాస్‌దారులకు ప్రీమియం రైళ్లలోని హై క్లాస్‌లో ప్రయాణించే వీలు కలుగనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Iifa Awards 2026 | ఐఫా అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే - ధురంధర్‌కు 12 అవార్డులు - టాప్ ప్లేస్‌లో షారుఖ్ తనయుడి వెబ్‌సిరీస్
- ●Yellamma Movie | వంద మంది జానపద కళాకారులతో "ఎల్లమ్మ" ఆటపాట
- ●CM Revanth Reddy | ఖైరతాబాద్‌లో దానం నాగేందరే పోటీ చేస్తారు
- ●Ramchandar Rao | మియాపూర్ భూములు అమ్మేస్తామంటే ఊకోం
- ●Ponnam Prabhakar | అమిత్ షా యాత్ర మోదీపై వ్యతిరేకతకు సంకేతం కాదా?
- ●Nora Fatehi | మనీలాండరింగ్ కేసులో నోరా ఫతేహీకి కోర్టు సమన్లు!

Iifa Awards 2026 | ఐఫా అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే - ధురంధర్‌కు 12 అవార్డులు - టాప్ ప్లేస్‌లో షారుఖ్ తనయుడి వెబ్‌సిరీస్

Yellamma Movie | వంద మంది జానపద కళాకారులతో "ఎల్లమ్మ" ఆటపాట

CM Revanth Reddy | ఖైరతాబాద్‌లో దానం నాగేందరే పోటీ చేస్తారు

Ramchandar Rao | మియాపూర్ భూములు అమ్మేస్తామంటే ఊకోం






