T20 World Cup | ఇంగ్లండ్‌ను ఢీకొట్టనున్న టీమిండియా.. ఐదుగురిపైనే అభిమానుల ఆశలు..
T20 World Cup | టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్-2లో భారత జట్టు గురువారం ముంబయి వాంఖడే క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జటు మాత్రమే ఈ నెల 8న జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఈ సారి సైతం విజయం సాధించి వరుసగా రెండోసారి ఐసీసీ టైటిల్‌ను సాధించి సరికొత్త చరిత్రను లిఖించాలని టీమిండియా భావిస్తోంది.
T20 World Cup | టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్-2లో భారత జట్టు గురువారం ముంబయి వాంఖడే క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జటు మాత్రమే ఈ నెల 8న జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఈ సారి సైతం విజయం సాధించి వరుసగా రెండోసారి ఐసీసీ టైటిల్‌ను సాధించి సరికొత్త చరిత్రను లిఖించాలని టీమిండియా భావిస్తోంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు సైతం వరుసగా గెలువలేదు. ఈ సారి టీమిండియా ఆ రికార్డును చేరుకోవాలని తహతహలాడుతున్నది.
పరుగుల వరదే..
వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ భారీగా పరుగల వరద పారే అవకాశం ఉంది. ఇరుజట్లలోనూ పవర్ హిట్టర్లు ఉన్నారు. ఈ క్రమంలో మైదానంలో బౌండరీల మోత మోగనుండగా.. సిక్సర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో భారత్-ఇంగ్లండ్ జట్లు సెమీస్‌లో తలపడుతుండడం ఇది మూడోసారి. 2022లో ఇంగ్లండ్ గెలిచింది. 2024లో భారత్ విజయం సాధించింది. ఈ సారి టీమిండియా మరోసారి ఇంగ్లిష్ జట్టును ఓడించి ఫైనల్‌కు వెళ్లాలని కసితో ఉంది. హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని జట్టు టీమిండియాను నాకౌట్‌కే పరిమితం చేయాలని భావిస్తోంది. సూర్యకుమార్ జట్టు సైతం జయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది.
ఇంగ్లండ్‌పై టీమిండియాదే పైచేయి..
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్, తిలక్ వర్మ వంటి పవర్‌ఫుల్ హిట్టర్లు భారత జట్టులో ఉన్నారు. అలాగే, హార్దిక్ పాండ్యా, అక్షర్‌పటేల్ వంటి ఆల్‌రౌండర్లు జట్టుకు అదనపు బలం కాగా.. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. జోస్ బట్లర్‌తో పాటు ఆల్‌రౌండర్ శామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్ వంటి మ్యాచ్ విన్నర్లు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారు. అయితే, పొట్టి ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉండడం విశేషం. ఇప్పటి వరకు రెండు జట్లు 29 టీ20 మ్యాచులు ఆడగా.. ఇందులో భారత్ 17, ఇంగ్లండ్ 12 మ్యాచులు గెలిచాయి. అభిమానులకు వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఉష్ణోగ్రతలు 27 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని అంచనా.
ఈ ఐదుగురిపైనే అందరి దృష్టి
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అందరి దృష్టి కేవలం ఐదుగురు ఆటగాళ్లపైనే ఉన్నది. ఐదుగురు రాణిస్తే టీమిండియా విజయం ఖాయమేనని అభిమానులు ఆశిస్తున్నారు. ఓపెనర్ సంజు శాంసన్ వెస్టిండీస్‌పై అజేయంగా 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరకు క్రీజులో ఉండి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఇషన్ కిషన్ సైతం ఇప్పటి వరకు ఏడు మ్యాచుల్లో 185 స్ట్రయిక్ రేట్‌తో 224 పరుగులు చేశాడు. సూర్యకుమార్ సైతం ఏడు మ్యాచుల్లో 231 పరుగులు చేశాడు. సెమీఫైనల్స్‌లో ట్రంప్ కార్డ్‌గా నిలువనున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా సైతం వాంఖడేలో మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మిస్టరీ బౌలర్ రాణిస్తే ఇంగ్లండ్‌కు ఓటమి తప్పని పేర్కొంటున్నారు. హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్‌పై మంచి రికార్డు ఉంది. ఆ జట్టుపై 414 పరుగులు చేయడంతో పాటు 19 వికెట్ల పడగొట్టాడు. ఈ సారి సైతం మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నారు.
Read Also :
Sanju Samson | సంజు శాంసన్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారా..? ఐసీసీ రూల్స్ ఏమంటున్నాయి..?
T20 WC | ముంబయి సిద్ధి వినాయకుడి సేవలో టీమిండియా క్రికెటర్లు..!
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






