త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs AUS | 2026-27 షెడ్యూల్‌ని విడుద‌ల చేసిన ఆస్ట్రేలియా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎప్పుడంటే..?

IND Vs AUS | ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (Cricket Australia) 2026-27 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేసింది. మొత్తం ఎనిమిది నెలల వ్యవధిలో 14 వేదికలపై 27 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

P

Sports | Published On Mar 22, 2026, 8.30 pm IST

IND Vs AUS | 2026-27 షెడ్యూల్‌ని విడుద‌ల చేసిన ఆస్ట్రేలియా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎప్పుడంటే..?
Advertisement

IND Vs AUS | ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (Cricket Australia) 2026-27 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేసింది. మొత్తం ఎనిమిది నెలల వ్యవధిలో 14 వేదికలపై 27 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులతో సీజన్ ప్రారంభమై, వచ్చే ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగే 150వ వార్షికోత్సవ టెస్టుతో ముగియనుంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి హైప్

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్ జనవరి మధ్య. చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, అధికారిక షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లయన్ వంటి సార్లు ఉన్న ఆస్ట్రేలియా జ‌ట్టు భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలవలేదు. దాంతో ఈ టూర్ వారికి కీలకంగా మారింది. ఆస్ట్రేలియా జట్టుకు ఈ షెడ్యూల్ చాలా కఠినంగా ఉండ‌బోతోంది. డిసెంబర్ ప్రారంభం నుంచి మార్చి మధ్య వరకు కేవలం 14 వారాల్లో ప‌ది టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి రానుంది.

ఆగస్టులో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడిన తర్వాత, అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు టెస్టులు ఆడనుంది. ఈ షెడ్యూల్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా న్యూజిలాండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ నిలిచింది. 1999 తర్వాత తొలిసారి న్యూజిలాండ్ మూడు కంటే ఎక్కువ టెస్టులు ఆడనుంది. పెర్త్, అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీ వేదికలపై ఈ మ్యాచులు జరగనున్నాయి. గబ్బా మైదానం భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా షెడ్యూల్ నుంచి త‌ప్పించింది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్‌ను మకాయ్‌లోని గ్రేట్ బ్యారియర్ రీఫ్ అరేనాలో నిర్వహించనున్నారు.

భారత్‌తో ఐదు టెస్టులు

ఆ త‌ర్వాత భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇది జనవరి నుంచి మార్చి 2027 వరకు కొనసాగి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో చివరి సిరీస్‌గా ఉంటుంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని జట్టుకు ఇది ఎంతో కీలకం. వైట్ బాల్ ఫార్మాట్‌లో నవంబర్ 13 నుంచి డిసెంబర్ 2 వరకు ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. పెర్త్‌లో ప్రారంభమై కాన్‌బెరాలో ముగిసే ఈ సిరీస్ మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ వంటి వేదికల్లో జరుగుతుంది. మార్చి 11 నుంచి 15 వరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఈ సీజన్‌కు హైలైట్‌గా నిలవనుంది. ఇది టెస్ట్ క్రికెట్‌కు 150 సంవత్సరాల నేప‌థ్యంలో నిర్వ‌హించ‌నున్న స్పెష‌ల్ మ్యాచ్‌.

మహిళల జట్టు షెడ్యూల్

ఆస్ట్రేలియా మహిళల జట్టు అక్టోబర్‌లో సీజన్‌ను ప్రారంభిస్తుంది. అక్టోబర్ 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది. బ్రిస్బేన్‌లో డే-నైట్ వన్డేలు, నార్త్ సిడ్నీ ఓవల్‌లో టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 2027 ఫిబ్ర‌వ‌రిలో న్యూజిలాండ్‌తో మూడు వ‌న్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 7 వరకు ఈ సిరీస్ జ‌రుగ‌నున్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement