త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND U19 vs SCO U19 | వైభ‌వ్ సూర్య‌వంశీ ధ‌నాధ‌న్‌..! స్కాట్లాండ్‌పై 192 ప్ల‌స్ స్ట్ర‌యిక్ రేట్‌తో బ్యాటింగ్‌..!

IND U19 vs SCO U19 | త్వ‌ర‌లోనే అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ మొద‌లుకానున్న‌ది. భారత అండర్-19 జట్టు స్కాట్లాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడ‌నున్న‌ది. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు. స్కాట్లాండ్ అండర్-19 కెప్టెన్ థామస్ నైట్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.

P

Sports | Published On Jan 10, 2026, 9.15 pm IST

IND U19 vs SCO U19 | వైభ‌వ్ సూర్య‌వంశీ ధ‌నాధ‌న్‌..! స్కాట్లాండ్‌పై 192 ప్ల‌స్ స్ట్ర‌యిక్ రేట్‌తో బ్యాటింగ్‌..!
Advertisement

IND U19 vs SCO U19 | త్వ‌ర‌లోనే అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ మొద‌లుకానున్న‌ది. భారత అండర్-19 జట్టు స్కాట్లాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడ‌నున్న‌ది. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు. స్కాట్లాండ్ అండర్-19 కెప్టెన్ థామస్ నైట్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 50 బంతులు ఎదుర్కొని 96 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అతను తొమ్మిది ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లు బాదాడు. 192 స్ట్ర‌యిక్ రేట్‌తో ప‌రుగులు చేశాడు. నాలుగు ప‌రుగుల దూరంలో సెంచ‌రీని తృటిలో చేజార్చుకున్నాడు. అంత‌కు ముందు వైభవ్ యూత్ వన్డేలో దక్షిణాఫ్రికాపై 127 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. దక్షిణాఫ్రికా గడ్డపై తన తొలి సెంచరీని నమోదు చేశాడు.

14 ఏళ్ల వైభవ్ ఐదు వేర్వేరు దేశాల్లో సెంచరీలు సాధించిన అతి పిన్న వయస్కులైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచాడు. స్వ‌దేశంతో పాటు యూఏఈ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లోనూ సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ దక్షిణాఫ్రికాను 3-0 తేడాతో ఓడించింది. అండర్-19 ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. దక్షిణాఫ్రికాపై 3-0తో క్లీన్ స్వీప్ చేయడమే దీనికి నిదర్శనం. అండర్-19 ప్రపంచ కప్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియాలలో జరగనుంది. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఐదుసార్లు అండర్-19 ప్రపంచ కప్ విజేత అయిన భారత జట్టుతో పాటు న్యూజిలాండ్, యూఎస్ఏ, బంగ్లాదేశ్‌ను గ్రూప్-బీలో చేర్చారు. జనవరి 15న యూఎస్ఏతో భార‌త్ తొలి మ్యాచ్ ఆడుతుంది. 17న బంగ్లాదేశ్‌తో, 24న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ హరారేలో జరగనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement