Women’s T20 World Cup | చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్‌గా టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ : జై షా
Women’s T20 World Cup | ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ త్వరలోనే ప్రారంభం కానున్నది. కీలక టోర్నీకి ముందు ఐసీసీ చైర్మన్ జై షా 12 జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సారి టోర్నీ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.
Women’s T20 World Cup | ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ త్వరలోనే ప్రారంభం కానున్నది. కీలక టోర్నీకి ముందు ఐసీసీ చైర్మన్ జై షా 12 జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సారి టోర్నీ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇంగ్లండ్-వేల్స్ వేదికగా జరిగే టోర్నీకి రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరు అవుతారని, మహిళల క్రికెట్‌కు ఇది అతిపెద్ద గ్లోబల్ ప్రసార పరిధి ఉంటుందన్నారు. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లు, కోట్లాది అభిమానులను ఒకే వేదికపై కలిపే ఈ టోర్నీ మరపురాని అనుభూతిని అందించనుందని ఆయన పేర్కొన్నారు. ఇది మహిళల టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ కావడం విశేషం. 2009 తర్వాత తొలిసారి ఇంగ్లండ్‌లో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. మొత్తం 33 మ్యాచ్‌లు ఏడు వేదికల్లో జరగనున్నాయి.
ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 2009లో తొలి టైటిల్ గెలిచిన చరిత్రను మళ్లీ పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2017లో స్వదేశంలో మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహం కూడా జట్టుకు బలాన్నిస్తోంది. జట్టుకు మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ ప్రస్తుతం హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఛాంపియన్ న్యూజిలాండ్ జట్టు 2024లో యూఏఈలో జరిగిన టోర్నమెంట్‌లో తొలి టైటిల్ గెలుచుకుని ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకు ఈ టైటిల్‌ను గెలిచిన నాలుగో దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆరు సార్లు టైటిల్ గెలిచి అత్యధిక విజయాలతో ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి.
ఈసారి మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా అర్హత సాధించాయి. బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లు క్వాలిఫయర్ ద్వారా టోర్నీలోకి అడుగుపెట్టాయి. నెదర్లాండ్స్ జట్టు తొలిసారిగా ప్రపంచకప్‌లో అడుగుపెడుతోంది. ఇది యూరోపియన్ మహిళల క్రికెట్ విస్తరణకు సంకేతంగా భావిస్తున్నారు. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-బీలో ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
ఇంగ్లండ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్, కౌంటీ గ్రౌండ్ బ్రిస్టల్, యుటిలిటా బౌల్, ది ఓవల్, లార్డ్స్ వంటి ప్రముఖ మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. టోర్నీకి ముందు ఈ నెల 6 నుంచి వార్మప్ మ్యాచులు మొదలయ్యాయి. జూన్ 30, జూలై 2 తేదీల్లో ది ఓవల్‌లో సెమీఫైనల్స్ జరగనుండగా, జూలై 5న లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. కీలక టోర్నీ ముందు కెప్టెన్‌తో ఐసీసీ ఆదివారం కార్నివాల్ నిర్వహించింది.
All fun and games at the Women's #T20WorldCup Captains’ Carnival 🥳
Grab your tournament tickets now 🎟️ https://t.co/8kyuNOXKdL pic.twitter.com/FWm3Hq5okt
— ICC (@ICC) June 7, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Trisha | మెడలో తాళితో త్రిష?.. వైరల్ అవుతున్న చెన్నై క్వీన్ ఫొటోలు
- ●CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Elon Musk Net Worth in Rupees | రూ. 9,49,50,50,00,00,000: ఎలాన్ మస్క్ 'ట్రిలియన్ డాలర్ల' ఆస్తితో ఏమేం కొనొచ్చో తెలుసా?
- ●MK Stalin | విజయ్ ప్రభుత్వం ఆరు నెలలు కాదు.. మూడు నెలలు ఉండేలా లేదు : స్టాలిన్
- ●CM Revanth Reddy | నా కుడి వైపున మహిళలే ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●HYDRAA | హైడ్రా ప్రజావాణికి విరామం.. మళ్లీ ఎప్పుడంటే

Trisha | మెడలో తాళితో త్రిష?.. వైరల్ అవుతున్న చెన్నై క్వీన్ ఫొటోలు

CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి

Elon Musk Net Worth in Rupees | రూ. 9,49,50,50,00,00,000: ఎలాన్ మస్క్ 'ట్రిలియన్ డాలర్ల' ఆస్తితో ఏమేం కొనొచ్చో తెలుసా?

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఆరు నెలలు కాదు.. మూడు నెలలు ఉండేలా లేదు : స్టాలిన్





