MK Stalin | విజయ్ ప్రభుత్వం ఆరు నెలలు కాదు.. మూడు నెలలు ఉండేలా లేదు : స్టాలిన్
MK Stalin | తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీపై ప్రతిపక్ష పార్టీలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాయి. విజయ్ ప్రభుత్వం మూడు నెలలు కూడా నిలబడదని పేర్కొంటున్నాయి.
MK Stalin | తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీపై ప్రతిపక్ష పార్టీలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాయి. విజయ్ ప్రభుత్వం మూడు నెలలు కూడా నిలబడదని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో స్టానిల్ చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశంగా మారాయి. ఈ మేడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని పార్టీ 108 సీట్లు గెలిచింది. ఆ తర్వాత పలు పార్టీల మద్దతుతో సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో గత 60 ఏళ్లలో తొలిసారి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ కాకుండా మరో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమిళనాట రాజకీయాల్లో సరికొత్త ఆరంభంగా విశ్లేషకులు అభివర్ణించారు. అయితే, ప్రతిపక్షాల దృక్కోణం మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ సీఎం ఎంకే స్టానిల్ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విడుతలై చిరుతైగల్ కట్చి మాజీ ఎమ్మెల్యే పనైయూర్ బాబు, ఆయన అనుచరులు డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆరు నెలల పాటు విమర్శలు చేయబోనని చెప్పానని, అయితే పరిస్థితులు వేగంగా మారుతున్నాయన్నారు. తాను అనుకున్న సమయానికి ముందే స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, విమర్శలు నిరంతరం పెరుగుతున్నాయన్నారు.
ఈ ప్రభుత్వం ఆరు నెలలు కాదు ఐదునెలలు కాదు.. నాలుగు నెలలు కాదు మూడు నెలలు కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న అని వ్యాఖ్యానించారు. తీవ్ర విమర్శల మధ్యే డీఎంకే కొత్త కార్యకర్తలకు స్టాలిన్ క్రమశిక్షణ పాఠాలు చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు తమ పూర్వ పార్టీలపై అవమానకర వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై చెప్పిన మాటలను ఉటంకిస్తూ.. ప్రత్యర్థి తోటలోని మల్లెపూలకూ సువాసన ఉంటుందని ఆయన గుర్తు చేశారు. రాజకీయాల్లో ఎవ్వరినీ తక్కువగా అంచనా వేయకూడదని సూచించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Trisha | మెడలో తాళితో త్రిష?.. వైరల్ అవుతున్న చెన్నై క్వీన్ ఫొటోలు
- ●CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Elon Musk Net Worth in Rupees | రూ. 9,49,50,50,00,00,000: ఎలాన్ మస్క్ 'ట్రిలియన్ డాలర్ల' ఆస్తితో ఏమేం కొనొచ్చో తెలుసా?
- ●CM Revanth Reddy | నా కుడి వైపున మహిళలే ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●HYDRAA | హైడ్రా ప్రజావాణికి విరామం.. మళ్లీ ఎప్పుడంటే
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అవమానం..!

Trisha | మెడలో తాళితో త్రిష?.. వైరల్ అవుతున్న చెన్నై క్వీన్ ఫొటోలు

CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి

Elon Musk Net Worth in Rupees | రూ. 9,49,50,50,00,00,000: ఎలాన్ మస్క్ 'ట్రిలియన్ డాలర్ల' ఆస్తితో ఏమేం కొనొచ్చో తెలుసా?

CM Revanth Reddy | నా కుడి వైపున మహిళలే ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు






