CM Revanth Reddy | నా కుడి వైపున మహిళలే ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
CM Revanth Reddy | నా కార్యక్రమం, సభ ఏది జరిగినా నా కుడి వైపున మహిళలే ఉండాలని, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : నా కార్యక్రమం, సభ ఏది జరిగినా నా కుడి వైపున మహిళలే ఉండాలని, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇక ప్రసంగం ప్రారంభిస్తూనే సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అధికారులకు సూచన.. ఎప్పుడు నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా కుడి వైపున ఆడబిడ్డలకు కుర్చీలు వేసిన తర్వాత ఎడమవైపున యువ సోదరులకు కుర్చీలు వేయండి. ఈ సభలో మహిళలను వెనుక భాగంలో కూర్చోబెట్టి యువ నాయకులను ముందర కూర్చోబెట్టారు. మహిళల ఆశీర్వాదంతో ఈ స్థాయికి ఎదిగాను. ఆడబిడ్డలు నిండు మనసుతో ఆశీర్వదించారు. ఆదేశాలు ఇస్తున్నా అధికారులందరికీ.. ఎక్కడ సభ జరిగినా నా కుడి వైపున మొత్తం మహిళలు కనిపించాలి. ఆ తర్వాతనే ఇతరులను కూర్చోబెట్టాలి. ఎడమవైపున యువ నాయకులను కూర్చోబెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచన చేశారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 7, 2026

CM Revanth Reddy | ఉప్పల్ చౌరస్తాలో రాజిరెడ్డి విగ్రహం పెడుతా : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 7, 2026

CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 7, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
- ●KTR | నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత
- ●Priyanka Mohan | గ్లామర్ డోస్ పెంచిన ఓజీ హీరోయిన్
- ●Hitler - HYDRAA | హిట్లర్, హైడ్రా అన్న మాటలు రేవంత్ ఇమేజ్ను పూర్తిగా డిమాలిష్ చేసేశాయి..!
- ●CM Revanth Reddy | ఉప్పల్ చౌరస్తాలో రాజిరెడ్డి విగ్రహం పెడుతా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Women’s T20 World Cup | చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్‌గా టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ : జై షా

CM Revanth Reddy | మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి

KTR | నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత

Priyanka Mohan | గ్లామర్ డోస్ పెంచిన ఓజీ హీరోయిన్

Hitler - HYDRAA | హిట్లర్, హైడ్రా అన్న మాటలు రేవంత్ ఇమేజ్ను పూర్తిగా డిమాలిష్ చేసేశాయి..!



