త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోకి స్కాట్లాండ్‌.. అప్‌డేటెడ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఐసీసీ..!

T20 World Cup | అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్‌ను స‌వ‌రించింది. టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌కు ఉద్వాస‌న ప‌లికిన విష‌యం తెలిసిందే. ఆ స్థానంలో స్కాట్లాండ్ జ‌ట్టుకు ఆడే అవ‌కాశం క‌ల్పించింది. ఆ జ‌ట్టును గ్రూప్‌-సీలో చేరుస్తూ షెడ్యూల్‌ను అప్‌డేట్ చేసింది.

P

Sports | Published On Jan 25, 2026, 2.48 pm IST

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోకి స్కాట్లాండ్‌.. అప్‌డేటెడ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఐసీసీ..!
Advertisement

T20 World Cup | అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్‌ను స‌వ‌రించింది. టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌కు ఉద్వాస‌న ప‌లికిన విష‌యం తెలిసిందే. ఆ స్థానంలో స్కాట్లాండ్ జ‌ట్టుకు ఆడే అవ‌కాశం క‌ల్పించింది. ఆ జ‌ట్టును గ్రూప్‌-సీలో చేరుస్తూ షెడ్యూల్‌ను అప్‌డేట్ చేసింది. ఈ జాబితాలో వెస్టిండిస్‌, ఇంగ్లాండ్‌తో పాటు ఇట‌లీ, నేపాల్‌తో క‌లిసి ఆడ‌నున్న‌ది. బంగ్లాదేశ్‌కు మ‌ద్ద‌తు తెలిపిన పాకిస్తాన్ గ్రూప్‌-ఏలో ఉంది.

బంగ్లాదేశ్‌లో రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లు, గంద‌ర‌గోళం, మైనారిటీల హ‌త్య‌ల నేప‌థ్యంలో ఆ దేశ ఫాస్ట్ బౌల‌ర్ ముస్తాఫిజుర్ రెహ‌మాన్‌ను విడుద‌ల చేయాల‌ని ఐపీఎల్‌లోని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టును బీసీసీఐ ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఎందుకు విదుడ‌ల చెప్పిందో మాత్రం స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో బీసీబీ ఆగ్ర‌హించింది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్ర‌సారాల‌ను నిలిపివేసింది. భ‌ద్ర‌త స‌మ‌స్య‌ల పేరుతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో షెడ్యూల్ చేసిన లీగ్ మ్యాచ్‌ల‌ను శ్రీ‌లంక‌కు త‌ర‌లించాల‌ని ఐసీసీని డిమాండ్ చేసింది.

బీసీబీ వాద‌న‌ల‌ను ఐసీసీ తోసిపుచ్చింది. గ్రూప్‌ను సైతం ఐర్లాండ్‌, జింబాబ్వేతో మార్చుకునేందుకు ప్ర‌తిపాదించ‌గా తిర‌స్క‌రించింది. బంగ్లాదేశ్ బోర్డు ఆ దేశ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత‌.. భార‌త్‌కు వెళ్లేది లేదిన స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో టోర్నీ నుంచి త‌ప్పించిన‌ట్లు ఐసీసీ అధికారికంగా ప్ర‌క‌టించింది. స్కాట్లాండ్‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రోసారి అప్‌డేటెడ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. షెడ్యూల్ ప్ర‌కారం.. స్కాట్లాండ్ కోల్‌క‌తాలో మూడు, ముంబ‌యిలో ఒక లీగ్ మ్యాచ్‌ను ఆడుతుంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫిబ్ర‌వ‌రి 7న ప్రారంభ‌మై.. మార్చి 8న ఫైన‌ల్ జ‌రుగుతుంది. ఫైన‌ల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రుగుతుంది. పాకిస్తాన్ ఫైన‌ల్‌కు చేరితే మాత్రం వేదిక కొలంబోకి మారుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement