Gambhir-Shashi Tharoor | శశి థరూర్ ట్వీట్‌కు స్పందించిన గౌతమ్ గంభీర్.. వివాదాస్పదమైన హెడ్‌కోచ్ పోస్ట్..!
Gambhir-Shashi Tharoor | నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలిటీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత జట్టు 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, టీమిండియా విజయం కంటే.. కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
Gambhir-Shashi Tharoor | నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలిటీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత జట్టు 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, టీమిండియా విజయం కంటే.. కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. భారత జట్టుకు కోచ్‌గా ఉన్నా.. జట్టుపై తనకు పూర్తి అధికారం, నియంత్రణ లేదని పరోక్షంగా గంభీర్ పేర్కొనట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హెడ్‌కోచ్ గంభీర్‌ను కాంగ్రెస్ ఎంపీ థరూర్ ప్రశంసించారు. మ్యాచ్‌కు ముందురోజు నాగ్‌పూర్‌లో గంభీర్‌ను కలిసి ప్రశంసించారు. ఈ సందర్భంగా సుధీర్ఘంగా ట్వీట్ చేస్తూ గంభీర్ సేవలను కొనియాడారు. తన పాత మిత్రుడు గౌతమ్ గంభీర్‌తో నాగ్‌పూర్‌లో మంచి సంభాషణ జరిగింది. ప్రధాని తర్వాత భారత్‌లో అత్యంత కష్టమైన ఉద్యోగం భారత జట్టుకు కోచ్‌గా ఉండమేనని తాను భావిస్తున్నానని.. లక్షలాది మంది ప్రతిరోజూ విమర్శించినా అతను ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతాడంటూ ప్రశంసలు కురిపించారు.
దీనికి గంభీర్ స్పందిస్తూ.. డాక్టర్ శశిథరూర్ మీకు ధన్యవాదాలు. ఈ దుమారం సద్దుమణిగాక ఒక కోచ్‌కు ఉండే అపరిమిత అధికారం వెనుక ఉన్న నిజానిజాలు, తర్కం బటయపడుతాయి. అప్పటివరకు, అత్యుత్తమమైన వారెవరైనా.. నన్ను నా సొంత వారికే వ్యతిరేకంగా నిలబెట్టడం ఆశ్చర్యంగా ఉంది" అని గంభీర్ పేర్కొన్నాడు. ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా గంభీర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు గంభీర్ సెలక్షన్ కమిటీని, ముఖ్యంగా అజిత్ అగార్కర్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడని భావిస్తున్నారు. గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాక జట్టులో భారీ మార్పులు జరిగాయి. సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్‌గా నియామకమయ్యాడు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. శుభ్‌మన్ గిల్‌ను టీ20 జట్టు నుంచి తొలగించారు. టెస్టుల్లో స్వదేశంలో, ఆస్ట్రేలియాలో సిరీస్‌లు కోల్పోయింది. స్వదేశంలో తొలిసారిగా న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. గంభీర్‌పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
భారత క్రికెట్‌లో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటూనే ఉంటుంది. అది జట్టును ఎవరు నియంత్రిస్తారు? కోచ్ ఆ.. లేక సెలక్షన్ కమిటీనా? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గంభీర్ ట్వీట్ ఆ చర్చను మరింత తీవ్రతరం చేసింది. కోచ్‌కు పూర్తి అధికారం లేదని చెబితే.. టీమ్ సెలక్షన్, రొటేషన్, జట్టులో మార్పులు విషయంలో సెలక్షన్ కమిటీదే కీలకపాత్ర. గంభీర్ ట్వీట్‌ను రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. మొదట జట్టు ఓటమికి, మార్పులకు తనపై విమర్శలు చేస్తున్న వారికి స్పందన ఒకటి కాగా.. అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు నిజం చెప్పాలనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. అయితే, ఏదైనా నేరుగా స్పందిస్తేనే క్లారిటీ రానున్నది. లేకపోతే ఊహాగానాలకే పరిమితం కానున్నది.

తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






