FIFA World Cup 2026 | ఈజిప్ట్ ఓన్ గోల్..!
FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-జీలో భాగంగా జరిగిన 16వ మ్యాచ్‌లో ఈజిప్ట్ గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. మ్యాచ్‌లో పట్టు కొనసాగించిన ఈజిప్ట్.. చివరకు బెల్జియంతో 1-1తో డ్రా చేసుకోవాల్సి వచ్చింది. తొలి అర్ధభాగంలో ఇమామ్ అషూర్ చేసిన గోల్‌తో ముందంజలో నిలిచిన ఈజిప్ట్, రెండో అర్ధభాగంలో జరిగిన ఓన్ గోల్ కారణంగా మూడు పాయింట్లను కోల్పోయింది.
- చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న జట్టు
- విలన్‌గా మారిన మహ్మద్ హనీ
- ఓటమిని తప్పించుకొని 1-1 తేడా చేసుకున్న బెల్జియం
FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-జీలో భాగంగా జరిగిన 16వ మ్యాచ్‌లో ఈజిప్ట్ గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. మ్యాచ్‌లో పట్టు కొనసాగించిన ఈజిప్ట్.. చివరకు బెల్జియంతో 1-1తో డ్రా చేసుకోవాల్సి వచ్చింది. తొలి అర్ధభాగంలో ఇమామ్ అషూర్ చేసిన గోల్‌తో ముందంజలో నిలిచిన ఈజిప్ట్, రెండో అర్ధభాగంలో జరిగిన ఓన్ గోల్ కారణంగా మూడు పాయింట్లను కోల్పోయింది. దీంతో ఇరు జట్లు ఒక్కో పాయింట్‌ను ఖాతాలో వేసుకున్నాయి. మ్యాచ్ ప్రారంభం నుంచే రెండు జట్లు ఆధిపత్యం సాధించేందుకు పోటీపడ్డాయి. అయితే, తొలి గోల్ చేసే అవకాశం ఈజిప్ట్‌కే వచ్చింది. 19వ నిమిషంలో ఇమామ్ అషూర్ అద్భుతమైన ఫినిషింగ్‌తో బెల్జియం గోల్‌కీపర్‌ను బురిడీ కొట్టిస్తూ అద్భుతమైన గోల్ వేశాడు. దాంతో ఈ గోల్‌తో ఈజిప్ట్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఆ తర్వాత బెల్జియం స్కోర్‌ని సమం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ, ఈజిప్ట్ పటిష్టమైన డిఫెన్స్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. బెల్జియం ప్లేయర్స్ ఈజిప్ట్ గోల్‌పోస్ట్ వరకు చొచ్చుకువెళ్లినా గోల్‌మాత్రం సాధించలేకపోయారు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఈజిప్ట్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో బెల్జియం పూర్తిగా దూకుడు పెంచింది. మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే గోల్ తప్పనిసరి కావడంతో ఎదురుదాడికి ప్రయత్నించింది. ముఖ్యంగా స్టార్ స్ట్రయికర్ రొమెలు లుకాకు ముందుండి జట్టును నడిపించాడు. మరోవైపు ఈజిప్ట్ సైతం ప్రత్యర్థి ఎదురుదాడిని అడ్డుకుంటూ కౌంటర్ అటాక్‌కు ప్రయత్నించింది. అయితే, మ్యాచ్ 66వ నిమిషంలో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. బెల్జియంను అదృష్టం వరించడంతో ఓ పాయింట్ అనుకోకుండా దక్కింది. థామస్ మెయునియర్ ఇచ్చిన ప్రమాదకరమైన లో క్రాస్‌ను క్లియర్ చేయబోయిన ఈజిప్ట్ డిఫెండర్ మహ్మద్ హానీ ఒత్తిడిలో పొరపాటు చేశాడు. బంతి అనుకోకుండా అతని కాలి నుంచి నేరుగా గోల్‌లోకి వెళ్లింది. దీంతో బెల్జియం స్కోరును 1-1తో సమం చేసింది. 2018లో రష్యాతో జరిగిన మ్యాచ్‌లో అహ్మద్ ఫతీ తర్వాత.. ప్రపంచ కప్ హిస్టరీలో ‘ఓన్ గోల్’ చేసిన రెండో ఈజిప్షియన్ ఆటగాడిగా హనీ నిలిచాడు.

ఆ గోల్ తర్వాత మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. మరో గోల్ కోసం ఇరుజట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. స్కోర్ సమం కావడంతో బెల్జియం అటాక్‌ను పెంచింది. ఈజిప్ట్ సైతం ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. అయితే, చివరి నిమిషాల్లో రెండు జట్లకు అవకాశాలు వచ్చినా గోల్‌గా మలచలేకపోయాయి. చివరకు 90 నిమిషాల ఆట ముగిసే సరికి స్కోరు 1-1 పరిమితమైంది. ఈజిప్ట్ తరఫున ఇమామ్ అషూర్ చేసిన గోల్ చేయగా.. మహ్మద్ హానీ ఓన్ గోల్ రూపంలో బెల్జియంకు ఒక పాయింట్ దక్కింది. దాంతో స్కోర్ సమమైంది. విజయానికి దగ్గరగా వచ్చిన ఈజిప్ట్ చివరకు చిన్న పొరపాటుకు భారీమూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఓటమి తప్పదనుకున్న స్థితి నుంచి బెల్జియం మ్యాచ్‌ను డ్రా చేసుకొని ఒక పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది. గ్రూప్-జీలో రాబోయే మ్యాచులు ఈ ఫలితం రెండు జట్లకూ కీలకంగా మారింది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●FIFA 2026 | దిగ్గజాలకు ఎదురుదెబ్బ.. తొలిమ్యాచ్‌లో దక్కని విజయం..
- ●Heat Wave | 48 గంటల పాటు దంచికొట్టనున్న ఎండలు.. ఉత్తర తెలంగాణకు వడగాల్పుల హెచ్చరిక
- ●Marriages | శుభ ఘడియలు వచ్చేశాయ్.. 16 నుంచి పెళ్లిళ్లే పెళ్లిళ్లు..!
- ●Narayanapet | పని అమ్మాయితో బంగారం వ్యాపారి 'లవ్ ఎఫైర్'.. ఇప్పుడామె 3 నెలల గర్భిణి
- ●Hyderabad | చెరువులో పడ్డ 'ఇయర్‌బర్డ్స్'.. నీటి మునిగిన ఇద్దరు స్నేహితులు
- ●Shani Vakri 2026 | త్వరలో తిరోగమించనున్న శనిదేవుడు.. ఈ మూడురాశుల వారికి అన్నీ శుభవార్తలే..!

FIFA 2026 | దిగ్గజాలకు ఎదురుదెబ్బ.. తొలిమ్యాచ్‌లో దక్కని విజయం..

Heat Wave | 48 గంటల పాటు దంచికొట్టనున్న ఎండలు.. ఉత్తర తెలంగాణకు వడగాల్పుల హెచ్చరిక

Marriages | శుభ ఘడియలు వచ్చేశాయ్.. 16 నుంచి పెళ్లిళ్లే పెళ్లిళ్లు..!

Narayanapet | పని అమ్మాయితో బంగారం వ్యాపారి 'లవ్ ఎఫైర్'.. ఇప్పుడామె 3 నెలల గర్భిణి





