త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Shivakumar | క‌ర్నాట‌కలో ఐపీఎల్ టికెట్ల వివాదానికి తెర‌.. వెల్ల‌డించిన డిప్యూటీ శివ‌కుమార్‌..!

DK Shivakumar | క‌ర్నాట‌క‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల కేటాయింపుపై నెలకొన్న వివాదానికి పరిష్కారం లభించింది. ఈ సమస్యను చర్చల ద్వారా సర్దుబాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.

P

Sports | Published On Mar 30, 2026, 9.30 pm IST

DK Shivakumar | క‌ర్నాట‌కలో ఐపీఎల్ టికెట్ల వివాదానికి తెర‌.. వెల్ల‌డించిన డిప్యూటీ శివ‌కుమార్‌..!
Advertisement

DK Shivakumar | క‌ర్నాట‌క‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల కేటాయింపుపై నెలకొన్న వివాదానికి పరిష్కారం లభించింది. ఈ సమస్యను చర్చల ద్వారా సర్దుబాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. క‌ర్నాట‌క రాష్ట్ర క్రికెట్ సంఘం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టికెట్ల కేటాయింపుపై ముందుగానే అసెంబ్లీ స్పీకర్‌తో పాటు పలువురు నేతలతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు.

ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రజాప్రతినిధులకు ఇంతకుముందు ఇచ్చే నాలుగు టికెట్ల స్థానంలో ఇకపై మూడు టికెట్లు మాత్రమే ఇవ్వనున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌ల సందర్భంలో రెండు ఉచిత టికెట్లు మాత్రమే కేటాయిస్తారు. అదనపు టికెట్లు కావాలంటే కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో క్రికెట్ సంఘం అధ్యక్షుడు, మాజీ భారత క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ పాల్గొన్నారు. టికెట్లు అవసరం లేని ప్రజాప్రతినిధులు ముందుగానే లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చని, ఇకపై ఈ అంశంపై వివాదం ఉండదని శివకుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రతినిధులకు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయిస్తారని, వాటితో పోలిస్తే కర్ణాటకలో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

చిన్నస్వామి స్టేడియం విస్తరణపై చర్చలు..

చిన్నస్వామి స్టేడియం సామర్థ్యాన్ని పెంచే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా సుమారు 20 వేల సీట్లు పెంచే ప్రతిపాదనపై అధికారులు నివేదిక ఇవ్వాలని సూచించినట్లు శివకుమార్ తెలిపారు. ఆ ప్రతిపాదనను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు అంశంపై తాను జోక్యం చేసుకోవడం ఇష్టపడటం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం భూముల కేటాయింపును చేపట్టినట్లు తెలిపారు. బెంగళూరులో గోల్డెన్ స్పా సమీపంలో 25 ఎకరాలు, తుమకూరులో 25 ఎకరాలు, మైసూరులో కూడా కొంత భూమిని కేటాయించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో బహుళ క్రీడలకు అనుకూలంగా కొత్త స్టేడియంల నిర్మాణానికి బెంగళూరులో పలు ప్రదేశాలను గుర్తించినట్లు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement