KTR | డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ నోటీసులు..! 48గంటల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్
KTR | డెక్కన్ క్రానికల్ దినపత్రిక యాజమాన్యానికి సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నోటీసులు పంపారు. బుధవారం (జులై 8) రోజున దినపత్రికలో ‘KTR's 'Landlord' Builds Tower in Hussainsagar’ శీర్షికతో వచ్చిన కథనం ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచురించారని ఆరోపించారు.
KTR | డెక్కన్ క్రానికల్ దినపత్రిక యాజమాన్యానికి సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నోటీసులు పంపారు. బుధవారం (జులై 8) రోజున దినపత్రికలో ‘KTR's 'Landlord' Builds Tower in Hussainsagar’ శీర్షికతో వచ్చిన కథనం ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచురించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన పీవీ జనని అండ్ అసోసియేట్స్ ద్వారా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు లీగల్ నోటీసు పంపారు. హుస్సేన్‌సాగర్ సమీపంలో ఓ ప్రైవేట్ డెవలపర్‌కు ఇచ్చిన భవన అనుమతులను జన్వాడలోని ఫామ్‌హౌస్ ఆస్తితో ముడిపెడుతూ కథనంలో తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఆ ప్రైవేట్ ప్రాజెక్ట్, సంబంధిత డెవలపర్, భవన అనుమతులతో కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, గతంలోనే నిరాధారంగా తేలిన అంశాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కథనాన్ని ప్రచురించారని ఆరోపించారు. కనీస జర్నలిస్ట్ నైతిక విలువలు పాటించకుండా, కథనం ప్రచురించే ముందు వివరణ కూడా కోరకపోవడం బాధ్యతారాహిత్యమని నోటీసులో విమర్శించారు. ఈ నేపథ్యంలో పరువు నష్టం కలిగించే కథనాన్ని, దానికి సంబంధించిన అన్ని డిజిటల్ లింకులను 48 గంటల్లోగా తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే, జరిగిన నష్టానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రచురించబోమని హామీ ఇవ్వాలని కోరారు. నిర్దేశించిన 48 గంటల గడువులోగా డిమాండ్లను అమలు చేయకపోతే డెక్కన్ క్రానికల్ యాజమాన్యంపై సివిల్, క్రిమినల్ కేసులతో పాటు నష్టపరిహారం కోసం కూడా చట్టపరమైన చర్యలు చేపడతామని కేటీఆర్ న్యాయవాద బృందం హెచ్చరించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
జులై 18, 2026
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి



