WPL 2026 | డబ్ల్యూపీఎల్ లో ఆ మూడు మ్యాచ్‌లకు స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేదు
WPL 2026 | భారత మహిళల టీ20 క్రికెట్ లీగ్ డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇప్పటికే 5 మ్యాచ్‌లు పూర్తవ్వగా ఈ సారి ట్రోఫీ కోసం బెంగళూరు, గుజరాత్, ముంబై జట్లు గట్టిగానే పోటీనిస్తున్నాయని ఆయా జట్లు ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లను చూస్తే స్పష్టమవుతుంది.
WPL 2026 | భారత మహిళల టీ20 క్రికెట్ లీగ్ డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇప్పటికే 5 మ్యాచ్‌లు పూర్తవ్వగా ఈ సారి ట్రోఫీ కోసం బెంగళూరు, గుజరాత్, ముంబై జట్లు గట్టిగానే పోటీనిస్తున్నాయని ఆయా జట్లు ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లను చూస్తే స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే ముంబై జట్టు టైటిల్ పోరులో ఫేవరెట్‌గా బరిలో ఉండగా, బెంగళూరు మరోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అలాగే గుజరాత్ జట్టు కూడా గట్టిపోటీనిస్తోంది. ఇక డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లకు ఈసారి వీక్షకుల సంఖ్య కూడా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రతిసారి లక్షల్లోనే ఉండే ప్రసారాల వ్యూస్ ప్రస్తుతం కోట్లలో ఉంటున్నాయి. అలాగే స్టేడియంలకు కూడా ప్రేక్షకులు భారీగానే హాజరవుతున్నారు.
అయితే డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లను ప్రస్తుతం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 14, 15, 16 తేదీలలో జరిగే మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదని చెప్పారు. ముంబైలో జరగనున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల కారణంగా ఆయా తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు స్టేడియం వద్ద భద్రత కల్పించలేమని పోలీసులు ఇప్పటికే బీసీసీఐకి స్పష్టం చేశారు. దీంతో ఆయా మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. కానీ అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. అయితే ఆ మ్యాచ్‌లకు టిక్కెట్లను కూడా విక్రయించడం లేదు. 17వ తేదీ నుంచి జరిగే మ్యాచ్‌లకు యథాతథంగా ఆన్ లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. కనుక ఆ మూడు తేదీల్లో మ్యాచ్‌లకు స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించబోరని స్పష్టమైంది.
జనవరి 14వ తేదీన ఢిల్లీ, యూపీ మ్యాచ్‌ను ఆ స్టేడియంలో నిర్వహించనుండగా, 15వ తేదీన ముంబై, యూపీ మ్యాచ్‌ను, 16న గుజరాత్, బెంగళూరు మ్యాచ్‌ను నిర్వహిస్తారు. 17వ తేదీన మళ్లీ రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. వాటికి మాత్రం టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. దీంతో 14, 15, 16 తేదీల్లో మ్యాచ్‌లను స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తారని వెల్లడైంది. కాగా ఈ సారి డబ్ల్యూపీఎల్ లో ఫైనల్‌తో కలిపి మొత్తం 22 మ్యాచ్‌లను నిర్వహించనుండగా, వాటిల్లో మొదటి 11 మ్యాచ్‌లను ముంబైలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. మిగిలిన మ్యాచ్‌లను వడోదరలో నిర్వహిస్తారు.
సంబంధిత వార్తలు

Amitabh Bachchan | నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిటల్లో చేరాడన్న వార్తలపై అమితాబ్ క్లారిటీ
మే 20, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



