త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WPL 2026 | ధ‌నాధ‌న్ క్రికెట్‌లో అద‌ర‌గొడుతున్న అమ్మాయిలు..! అంద‌రి దృష్టి వీరిపైనే..!

WPL 2026 | ఐపీఎల్ త‌ర‌హాలోనూ వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ సైతం అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న‌ది. ఎంతో మంది యువ ఆట‌గాళ్ల‌ను ధ‌నాధ‌న్ క్రికెట్ వెలుగులోకి తెస్తున్న‌ది. దేశవాళీ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఆరంభించిన ఈ లీగ్‌తో ఇప్ప‌టికే ఎంతో మంది అంత‌ర్జాతీయ స్థాయిలో మెరిసేందుకు చ‌క్క‌టి అవ‌కాశంగా నిలిచింది.

P

Sports | Published On Jan 13, 2026, 4.11 pm IST

WPL 2026 | ధ‌నాధ‌న్ క్రికెట్‌లో అద‌ర‌గొడుతున్న అమ్మాయిలు..! అంద‌రి దృష్టి వీరిపైనే..!
Advertisement

WPL 2026 | ఐపీఎల్ త‌ర‌హాలోనూ వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ సైతం అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న‌ది. ఎంతో మంది యువ ఆట‌గాళ్ల‌ను ధ‌నాధ‌న్ క్రికెట్ వెలుగులోకి తెస్తున్న‌ది. దేశవాళీ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఆరంభించిన ఈ లీగ్‌తో ఇప్ప‌టికే ఎంతో మంది అంత‌ర్జాతీయ స్థాయిలో మెరిసేందుకు చ‌క్క‌టి అవ‌కాశంగా నిలిచింది. ఈ టోర్నీలో రాణించి శ్రేయాంక పాటిల్‌, సైకా ఇషాక్‌తో పాటు ప‌లువురు యువ ప్లేయ‌ర్ ఎంతో మంది వెలుగులోకి వ‌చ్చారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న నాలుగో సీజ‌న్‌లోనూ ప‌లువురు అమ్మాయిలు స‌త్తా చాటుతున్నారు. త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

నందిని శ‌ర్మ‌

చండీఘ‌డ్‌కు చెందిన నందిని శ‌ర్మ వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌లో అద‌ర‌గొడుతున్న‌ది. ఢిల్లీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన ఈ ఫాస్ట్‌బౌల‌ర్ రెండు మ్యాచుల్లోనే ఏడు వికెట్లు తీసింది. తొలి మ్యాచ్‌లో ముంబ‌యి ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసింది. రెండో మ్యాచ్‌లో గుజ‌రాత్‌తో జ‌రిగిన మ్యాచ్‌లు ఐదు వికెట్లు తీసి సంచ‌ల‌నం సృష్టించింది. ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు కుప్ప‌కూల్చ‌డం విశేషం. లైన్ అండ్ లెన్త్‌తో బంతులు విసురుతూ బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెడుతున్న‌ది. డ‌బ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు కేవ‌లం రూ.20ల‌క్ష‌ల‌కే ఆమెను జ‌ట్టులోకి తీసుకుంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన నందిని.. త‌న బౌలింగ్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

న‌దైన్ డీ క్లెర్క్

ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ న‌దైన్ డీ క్లెర్క్ గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. గ‌త కొంత‌కాలంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్‌లో మెరుగ్గా రాణిస్తున్న‌ది. గ‌తేడాది జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌ప్ స‌మ‌యంలో నదైన్‌పై అంద‌రి దృష్టి ప‌డింది. భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓ ద‌శ‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌ద‌ని అంతా భావించారు. కానీ, 84 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి ప్రొటీస్ జ‌ట్టుకు అనూహ్య విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టింది. టోర్నీ ఆసాంతం జ‌ట్టుకు ఉప‌యోగ‌ప‌డేలా ప‌రుగులు చేసింది. డ‌బ్ల్యూపీఎల్ వేలంలో న‌దైన్‌ను బెంగ‌ళూరు జ‌ట్టు రూ.64ల‌క్ష‌ల‌కు సొంతం చేసుకుంది. గ‌త సీజ‌న్‌లో డ‌బ్ల్యూపీఎల్ ఎంట్రీ ఇచ్చినా.. ఒకే మ్యాచ్ ఆడే అవ‌కాశం ద‌క్కింది. ఈ సీజ‌న్‌లో తొలి మ్యాచ్‌లో ముంబ‌యిపై స‌త్తా చాటింది. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీయ‌డ‌మే కాకుండా 63 ప‌రుగులు చేసి బెంగ‌ళూరుకు విజ‌యం క‌ట్ట‌బెట్టింది. యూపీ వారియర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రెండు వికెట్ల ప‌డ‌గొట్టింది.

లారెన్ బెల్‌

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ లారెన్ బెల్ ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌త్తా చాటుతున్న‌ది. కొంత‌కాలంగా ఇంగ్లండ్ జ‌ట్టులో కీల‌క ఫాస్ట్ బౌల‌ర్‌గా ఉన్న‌ది. లైన్ అండ్ లెన్త్‌తో ప‌రుగులు చేస్తూ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు ప‌డ‌గొడుతున్న‌ది. డబ్ల్యూపీఎల్‌లో ఆల‌స్యంగా ఎంట్రీ ఇచ్చింది. గ‌తేడాది జ‌రిగిన వేలంలో ఆర్‌సీబీ జ‌ట్టు రూ.90ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా బౌలింగ్ చేసింది. అమేలియా కెర్ లాంటి బ్యాట‌ర్ క్రీజులో ఉండ‌గానే సీజ‌న్‌లో తొలి ఓవ‌ర్‌ను మెడిన్‌గా వేయ‌డం విశేషం. నాలుగు ఓవ‌ర్ల‌లో 14 ప‌రుగులు ఇచ్చి కీల‌క వికెట్ తీసింది. యూపీతో జ‌రిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవ‌ర్ల‌లో 16 ప‌రుగులు ఇచ్చి వికెట్ తీసింది.

నికోలా కేరీ

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ నికోలా కేరీ ఈ సారి కొత్త‌గా వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. ముంబ‌యి ఆమెను రూ.30ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. తొలి రెండు మ్యాచుల్లో అద‌ర‌గొట్టింది. బెంగ‌ళూరుతో మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 40 పరుగులు చేసింది. బౌలింగ్ వేసి రెండు వికెట్లు తీసింది. ఢిల్లీతో జ‌రిగిన రెండో మ్యాచ్‌లో 21 ప‌రుగులు చేయ‌డంతో పాటు మూడు వికెట్లు తీసింది.

లిజెల్ లీ

ద‌క్షిణాఫ్రికా వికెట్ కీప‌ర్ కం బ్యాట‌ర్ లిజెల్ లీ ఆల‌స్యంగా వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌లోకి వ‌చ్చింది. త‌న అవ‌తారంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. భారీ ఖాయమైనా వికెట్ల వెనుక చురుగ్గా క‌దులుతూ మెరుపులు మెరిపిస్తున్న‌ది. గుజ‌రాత్ త‌ర‌ఫున స‌త్తా చాటుతున్న‌ది. వేలంలో రూ.30ల‌క్ష‌లు గుజ‌రాత్ ఆమెను తీసుకున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచుల్లో 96 ప‌రుగులు చేసింది. ఇక వీరితో ప‌లువురు మ‌రికొంద‌రు ప్లేయ‌ర్లు త‌మ ఆట‌తీరుతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement