లోడ్ అవుతోంది...


Gram Panchayat
Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక అందించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ. 277 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ అధికారులు పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను వెంటనే విడుదల చేశారు.
నిధుల విడుదలతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులను గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని సర్పంచ్‌లు తెలిపారు.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam