WPL 2026 | బెంగళూరు జోరు.. యూపీపై ఘన విజయం..
WPL 2026 | ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ 2026 టోర్నీ 5వ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ వుమెన్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యూపీ మహిళల జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని బెంగళూరు మహిళల జట్టు చాలా సునాయాసంగా ఛేదించింది.
WPL 2026 | ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ 2026 టోర్నీ 5వ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ వుమెన్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యూపీ మహిళల జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని బెంగళూరు మహిళల జట్టు చాలా సునాయాసంగా ఛేదించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెంగళూరు టీమ్ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లలో సత్తా చాటడమే కాక, బ్యాటింగ్‌లోనూ రాణించింది. దీంతో బెంగళూరు అలవోకగా గెలిచింది.
స్వల్ప స్కోరు చేసిన యూపీ..
మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా యూపీ వారియర్జ్ వుమెన్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు ప్లేయర్లలో టాప్ ఆర్డర్ విఫలం చెందింది. మ్యాచ్ ఆరంభం అయిన వెంటనే వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. దీంతో భారీ స్కోరు చేయడం కష్టమైంది. యూపీ ప్లేయర్లలో దీప్తి శర్మ 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, మరో ప్లేయర్ దియేంద్ర డాటిన్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు ప్లేయర్లు చివరి ఓవర్లలో పరుగులను ధాటిగా రాబట్టే ప్రయత్నం చేశారు. దీంతో యూపీ మహిళల జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్, నదిన్ డి క్లర్క్ చెరో 2 వికెట్లను పడగొట్టగా, లారెన్ బెల్ 1 వికెట్ తీసి అలరించింది. తొలి మ్యాచ్‌లో లాగే ఇందులో కూడా బెల్ చాలా పొదుపుగా పరుగులను ఇవ్వడం విశేషం. మొత్తం 4 ఓవర్లు వేసిన బెల్ కేవలం 16 పరుగులను మాత్రమే ఇచ్చి ఆకట్టుకుంది.
చెలరేగిన ఆర్‌సీబీ ఓపెనర్లు..
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, గ్రేస్ హారిస్ చెలరేగిపోయారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 137 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 40 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో హారిస్ 85 పరుగులు చేయగా, కెప్టెన్ స్మృతి 32 బంతుల్లో 9 ఫోర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అలాగే యూపీ బౌలర్లలో శిఖా పాండేకు 1 వికెట్ దక్కింది. ఈ క్రమంలో బెంగళూరు జట్టు 12.1 ఓవర్లలోనే కేవలం 1 వికెట్‌ను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 145 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో బెంగళూరు జట్టు టోర్నీలో తన రెండో విజయాన్ని నమోదు చేయగా, పాయింట్ల పట్టికలోనూ అగ్ర స్థానంలో ఉండడం విశేషం.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






